హైదరాబాద్, డిసెంబర్ 19 : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తెలంగాణ, సమైక్య నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. జనవరి 3 నుంచి అసెంబ్లీ రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
జనవరి 3 నుంచి 10 వరకు రెండో విడత సమావేశాలు, జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాతి సెలవులు, జనవరి 16 నుంచి 23 వరకు మూడో విడత సమావేశాలు జరుగనున్నాయి. అయితే అసెంబ్లీ నిరసవ«ధిక వాయిదాపై టీఆర్ఎస్, బీజేపీ, టీటీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ఏకపక్షంగా వాయిదా వేశారని టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేయగా, తెలంగాణ టీడీపీ నేతలు పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.