Recent Posts

యువతితో మాట్లాడినందుకు పురుషాంగం.....

26, డిసెంబర్ 2013, గురువారం

బెంగళూరు, న్యూస్‌లైన్: తమ వర్గం యువతితో మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని చితకబాది అతడి పురుషాంగాన్ని కోసేసిన దారుణం కర్ణాటకలో మంగళూరు సమీపంలోని బంట్వాళలో జరిగింది. దీంతో బాధిత యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాలు..

 

 బంట్వాళలోని గడియార గ్రామానికి చెందిన జైరామ్ అనే యువకుడు ఆదివారం ఓ యువతితో మాట్లాడుతుండగా, యువతి బంధువులు వీరిని గమనించి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. యువతిని అక్కడి నుంచి పంపించి జైరామ్‌ను చితకబాదారు. దుస్తులు ఊడదీసి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. గాజు పెంకుతో అతడి పురుషాంగాన్ని కోసేశారు. తీవ్ర రక్తస్రావంతో యువకుడు స్పృహతప్పి పడిపోగా, చనిపోయాడని భావించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. దారుణానికి ఒడిగట్టిన వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వినోదం - తాజా - Google వార్తలు