Recent Posts

హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

21, డిసెంబర్ 2013, శనివారం

హైదరాబాద్, డిసెంబర్ 19 : శీతాకాల విడిది కోసం రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు విచ్చేశారు. హకీంపేట్ విమానాశ్రయంవద్ద ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, ముఖ్యనేతలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి అతిథి భవన్‌కు బయలుదేరారు.  ఈ నెల 31వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి రెండు వారాలు బస చేయడం ఆనవాయితి. ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి హైదరాబాదుకే వస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును నిరసిస్తున్న సమైక్యవాదుల నుండి నిరసనల వ్యక్తమయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రణబ్ పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.  

కాగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరేందుకు సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కోరేందుకు తెలంగాణ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.

వినోదం - తాజా - Google వార్తలు