హైదరాబాద్, డిసెంబర్ 19 : అసెంబ్లీ సమావేశాలను జనవరి 3వ తేదీకి వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఛాంబర్ ఎదుట గురువారం మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ శాసనసభ్యులు «ధర్నా చేపట్టారు. వారి ఆందోళనతో సీఎం బయటకు వచ్చారు. ఎమ్మెల్యేలు ఇలా ఆందోళన చేయడం సరికాదని చెబుతూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా సభ్యులు వినలేదు. దీంతో మార్షల్స్ సహాయంతో ముఖ్యమంత్రి బయటకు వెళ్ళిపోయారు. రాత్రి కూడా సభలోనే ఉండనున్నట్లు సభ్యులు తెలిపారు. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే అసెంబ్లీ వాయిదా పడింది. తిరిగి వచ్చే నెల 3నుంచి 10వ తేది వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.
20, డిసెంబర్ 2013, శుక్రవారండిసెంబర్ 20, 2013
టీ. టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా
By Fun Counter
20, డిసెంబర్ 2013, శుక్రవారం