Recent Posts

కొత్త రాష్ట్రాల డిమాండ్లపై విజ్ఞత అవసరం

20, డిసెంబర్ 2013, శుక్రవారం

ఢిల్లీ, డిసెంబర్ 19 : కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా ప్రజలందరినీ ఒక చోట ఉంచడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో గురువారం ఉదయం జరిగిన నిఘావర్గాల అధికారుల సమావేశంలో మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, కొత్త రాష్ట్రాల డిమాండ్లపై రాజకీయంగా పరిపాలనా పరంగా విజ్ఞతతో వ్యవహరాంచాలని ఆయన అన్నారుఉగ్రవాదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా నైపుణ్యాలను పెంచుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ పిలుపునిచ్చారు.

 కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికి గురువారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన ఇక్కడే ఉంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి రెండు వారాలు బస చేస్తున్నారు. ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి హైదరాబాదుకే వస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును నిరసిస్తున్న సమైక్యవాదుల నుండి నిరసనల వ్యక్తమయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రణబ్ పర్యటన సజావుగా సాగేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారుప్రణబ్ కార్యక్రమాలకు ప్రత్యేక హెలికాప్టర్ వినియోగిస్తారు.



వినోదం - తాజా - Google వార్తలు