Recent Posts

మణిపూర్ గవర్నర్ గా వీకే దుగ్గల్

24, డిసెంబర్ 2013, మంగళవారం

న్యూఢిల్లీ: హోంశాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్- మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనను ఈ పదవిలో నియమించారని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

1968 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన దుగ్గల్ 2007లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 1996 నుంచి 2000 వరకు ఢిల్లీ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో(ఎన్డీఏమ్ఏ)లో ప్రస్తుతం సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ సమస్య పరిష్కరించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణా కమిటీలో సభ్యుడిగానూ ఆయన వ్యవహరించారు.

వినోదం - తాజా - Google వార్తలు