Recent Posts

పోస్ట్ ప్రొడక్షన్ దశలో పార్క్

24, డిసెంబర్ 2013, మంగళవారం

వి. ఎన్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న 'పార్క్' చిత్రం చిత్రీకరణ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్నట్టు  నిర్మాత రమేష్ గోగుల చెప్పారు. ఈ  చిత్రాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తామని అయన చెప్పారు. చిత్ర కథానాయకి సరయు జన్మదినం సందర్భంగా డిసెంబర్ 24 వ తేదిన ఒక పాటని ఇంటర్నెట్ లో పెడుతున్నట్టు ఆయన తెలిపారు. గితామాధురి పాడిన ఈ పాటని సిరాశ్రి రచించారు. శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రానికి  హైమవతి గోగుల కుడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.   

వినోదం - తాజా - Google వార్తలు