Recent Posts

పీచు పదార్థాలతో గుండె జబ్బులు దూరం

23, డిసెంబర్ 2013, సోమవారం

లండన్: పీచు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా హృదయకోశ సంబంధమైన వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు దశాబ్దాలుగా ప్రచురించిన పలు పరిశోధనా పత్రాలను లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న పళ్ళు, కూరగాయలను ప్రతిరోజూ (రోజుకు ఏడు గ్రాముల చొప్పున) తీసుకోవడం కార్డియోవాస్కులర్ డిసీజెస్ (సీవీడీ), కరొనరీ హార్ట్ డిసీజెస్ (సీహెచ్‌డీ) వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం గమనించామని వారు తెలిపారు.

వినోదం - తాజా - Google వార్తలు