తిరుపతి, డిసెంబర్ 23: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న లడ్డూ తయారీకి ఉపయోగించే బూందీ చేసే వంటశాలలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. అగ్ని నిరోధక సిలిండర్‌లోని కెమికల్ ఏజెంట్ డ్రై పౌడర్ విడుదల కావడంతో ఈ కలకలం చెలరేగింది. గ్యాస్ లీకైందని భావించిన సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. లడ్డూకు ఉపయోగించే ముడి సరకుల్లో ఒకటైన బూందీని తయారు చేసేందుకు టిటిడి ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్ వెనుక ప్రత్యేక పాకశాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అందులోని ద్రవ పదార్థం విడుదలైంది. అది అగ్ని నిరోధక పరికరమని తెలియని సిబ్బంది గ్యాస్ లీకైందంటూ పరుగలు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్‌ను తరలించారు.
24, డిసెంబర్ 2013, మంగళవారండిసెంబర్ 24, 2013
శ్రీవారి బూందీ పోటులో కలకలం
By Fun Counter
24, డిసెంబర్ 2013, మంగళవారం