Recent Posts

'మీసేవ'కు రిజిస్ట్రేషన్లు బదిలీ!

26, డిసెంబర్ 2013, గురువారం

హైదరాబాద్, డిసెంబర్ 25 : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ (ఆర్ అండ్ ఎస్) శాఖలో ప్రభుత్వం రోజుకో కొత్త విధానం ప్రవేశపెడుతూ అటు సిబ్బందిని, ఇటు ప్రజలను గందరగోళంలో పడేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివరాల కంప్యూటరీకరణ పూర్తికాకుండానే పలు «ద్రువ పత్రాల జారీని 'మీ సేవ'కు బదలాయించడం ఇప్పటికే కొత్త సమస్యలకు దారితీసింది. దీంతో సబ్-రిజిస్ట్రార్లు, సిబ్బంది రోడ్డెక్కేందుకు సిద్ధం కాగా, ఆ శాఖ మంత్రి జోక్యం చేసుకుని సదరు సేవలను తిరిగి వారి పరిధిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా దస్తావేజు లేఖరుల వంతు వచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని 'మీ-సేవ' కేంద్రాలకు అప్పగించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుండటమే దీనికి కారణం. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద, ఇతర ప్రాంతాల్లో స్టాంపు పత్రాల విక్రయం, దస్తావేజులు రాయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది జీవిస్తున్నారు.

 

ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరి జీవనోపాధి ప్రమాదంలో పడనుంది. అధికారంలో ఉన్నవారు తమ అనుయాయులకు మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి దస్తావేజు లేరులుగా జీవిస్తున్న తమ కుటుంబాలు రోడ్డునపడే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సబ్-రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సహకారంతో గురువారం నుంచి మూడు రోజులపాటు పెన్‌డౌన్ చేయనున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి, తన నిర్ణయం మార్చుకోవాలని ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కరీముల్లా విజ్ఞప్తి చేశారు. సర్కారు ఏకపక్ష నిర్ణయాలను ఆదినుంచీ వ్యతిరేకిస్తున్నామని, దస్తావేజు లేఖరులకు పూర్తి మద్దతు పలుకుతున్నామని సబ్-రిజిస్ట్రార్స్ అసోసియేషన్ నేతలు కూడా ప్రకటించారు.

వినోదం - తాజా - Google వార్తలు