Recent Posts

వైభవంగా మహాసౌరయాగం

20, డిసెంబర్ 2013, శుక్రవారం

శ్రీకాకుళం, డిసెంబర్ 18: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలోమహాసౌరయాగ సహిత మహాకుంభాభిషేక మహాత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం పూర్ణకుంభంతో ఆలయ అర్చక బృందం తిరువీధి నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రయుత ధనుర్లగ్నంలో మహాసౌరయాగ కలశాన్ని సూర్యనారాయణ స్వామివారి చెంత ఉంచి విశేష హారతిని ఇచ్చిన అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రధాన యాగశాలలో సద్గురు కృష్ణయాజీ ప్రత్యేక సంకల్పం చేశారు.
నిగమ, ఆగమం ప్రకారం శాస్రోక్తంగా 150 మంది రుత్విక్కులు పూజలు నిర్వహించగా, 36 హామగుండాల్లో 36 మంది దంపతులు 108 వనమూలికలతో సౌరయాగాన్ని నిర్వహించారు. తొలుత స్వామి దర్శనానికి వచ్చిన వౌనానంద తపోవనం (విశాఖ) పీఠాధిపతి శ్రీరామానందభారతి స్వామి, కుటుంబసమేతంగా హాజరైన మాజీ మంత్రి ధర్మానప్రసాదరావులకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాసౌరయాగ మహోత్సవ సంస్కృతి సంరంభం వేదికను మాజీ మంత్రి ధర్మాన జ్యోతిప్రజ్వలనం చేసి ప్రారంభించారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి శ్రీసూర్యనారాయణస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశామని ధర్మాన తెలిపారు. దేవస్థానం నిధులతో కాకుండా దాతల సాయంతో ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు

వినోదం - తాజా - Google వార్తలు