25, డిసెంబర్ 2013, బుధవారండిసెంబర్ 25, 2013
బస్ లో చెలరేగిన మంటలు
By Fun Counter
25, డిసెంబర్ 2013, బుధవారం
అనంతపురం, డిసెంబర్ 25 : జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కలకలం రేగింది. బుధవారం ఉదయం కదిరికి వెళ్లేందుకు బయలేదేరిన ఓ బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి, ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి బయటకు దింపివేశారు. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది