లండన్, డిసెంబర్ 24: తీవ్రమైన పెనుతుఫాను బ్రిటన్, ఫ్రాన్స్‌లను అతలాకుతలం చేసింది. గంటకు 90 మైళ్ల వేగంతో ప్రచండ గాలులు వీయడంతోపాటు అతి భారీ వర్షాలకు ఐదుగురు మరణించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడడంతో క్రిస్మస్ ప్రయాణాలకు, షాపింగ్‌కు ఆటంకం ఏర్పడింది. విమానాలు రద్దవడంతో లండన్, పారిస్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. దక్షిణ బ్రిటన్‌లో అనేక రైళ్లను రద్దు చేశారు. లండన్‌కు రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఫ్రాన్స్‌లో అన్ని రైళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారానికి కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. క్రిస్మస్‌కు జోరుగా అమ్మకాలు సాగుతాయని భావిం చిన వర్తకులకు తుఫానుతో నిరాశ తప్పలేదు.
25, డిసెంబర్ 2013, బుధవారండిసెంబర్ 25, 2013
బ్రిటన్, ఫ్రాన్స్ ల లో తుఫాను బీభత్సం
By Fun Counter
25, డిసెంబర్ 2013, బుధవారం