Recent Posts

శ్రీదేవి నివాసంలో అగ్నిప్రమాదం

22, డిసెంబర్ 2013, ఆదివారం

ముంబై :

బాలీవుడ్ తార శ్రీదేవి నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీదేవి బెడ్ రూమ్ లోని ఎయిర్ కండీషనర్ షార్ట్ సర్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో శ్రీదేవి బెడ్ రూమ్ పూర్తిగా కాలిపోయినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో శ్రీదేవితోపాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ, ఆమె అత్త కూడా ఉన్నారు. 

 

అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తన అత్తను సంజయ్ కపూర్ ఇంటికి, కూతుళ్లను స్నేహితుల నివాసానికి పంపి శ్రీదేవి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లో పూర్తిగా అంధకారం నెలకొనడంతో గత రాత్రి హోటల్ లోనే గడిపినట్టు తెలిసింది. విషయం తెలిసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు శ్రీదేవికి ఫోన్ చేసి పరామర్శించారు.

 

వినోదం - తాజా - Google వార్తలు