హైదరాబాద్, డిసెంబర్ 19 : దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీలో గుర్తింపు పొందిన సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)-తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమి నిర్ణయించింది. రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో ఆర్టీసీ యాజమాన్యం తమ కూటమితో జులై 4 న చేసుకున్న ఒప్పందాలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో కార్మికవర్గాల్లో ఆందోళన నెలకొందని, ఈ క్రమంలోనే యాజమాన్యం వైఖరికి నిరసనగా శుక్రవారం(20.12.2013) సమ్మె నోటీసివ్వనున్నామని ఈయూ, టీఎంయూ ప్రధానకార్యదర్శులు కె. పద్మాకర్, ఇ. అశ్వథ్థామరెడ్డి వెల్లడించారు.
21, డిసెంబర్ 2013, శనివారండిసెంబర్ 21, 2013
ఆర్టీసీ సమ్మె నోటిస్
By Fun Counter
21, డిసెంబర్ 2013, శనివారం