విజయవాడ, డిసెంబర్ 22: ఎంతో భక్తిశ్రద్ధలతో 41 రోజుల పాటు దీక్షలో కొనసాగిన భవానీ భక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి తమ దీక్షలను విరమించడానికి బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను గుర్తు చేసేలా ఆదివారం రాత్రి నుంచే ఇంద్రకీలాద్రి ధగధగాయమనంగా రంగురంగుల విద్యుద్దీపాలతో అలరారుతున్నది. మరో వైపు కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధి వరకు క్యూలైన్ల నిర్మాణం జరిగింది. పైగా భవానీల గిరిప్రదక్షణ కోసం ఇంద్రకీలాద్రి చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా, భారీ వాహనాలేవీ ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు గాను బందోబస్తుకు 1800 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. సోమవారం తెల్లవారుజామున దుర్గమ్మ సన్నిధిలోని భవానీదీక్ష మంటపంలో ఏర్పాటైన హోమగుండం వద్ద కలశస్థాపనతో దీక్షల విరమణ ఆరంభమవుతుంది. ఇంద్రకీలాద్రి దిగువన భవానీలు తమ దీక్షల విరమణ సందర్భంగా ఇరుముడులు సమర్పించుకోనందుకు వీలుగా ఐదు ప్రాంతాల్లో అతిపెద్ద హోమగుండాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రఘునందనరావు, పోలీసు కమిషనర్ శ్రీనివాసులు ఇప్పటికే పలుమార్లు స్వయంగా ఏర్పాట్లు పరిశీలించి ఎప్పటికప్పుడు సూచనలందించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు కూడా నగరంలో భారీ వాహనాలేవీ ప్రవేశించకుండా నగర శివారుల నుంచే వేర్వేరు మార్గాల్లోకి మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి కోల్‌కత్తా వైపు వెళ్ళే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్‌జంక్షన్‌లో జాతీయ రహదారిలో కలువాలి. అవాగే చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు కనకదుర్గమ్మ వారధి నుంచి గన్నవరం, హనుమాన్‌జంక్షన్, మైలవరం మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిలో కలువాలి. నగరంలో తిరిగే సిటీ బస్సులను కూడా వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తున్నారు. ఈ వారం రోజుల్లో కనీసం 14 లక్షల మంది భక్తులు తరలిరాగలరనే అంచనానతో లడ్డుల తయారీ జరుగుతున్నది. అలాగే 15 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. 786 మంది క్షురకులు, 200 మంది పురోహితులను అలాగే స్నానఘట్టాలలో పారిశుద్ధ్య నిర్వహణకై 200 మంది సిబ్బంది, 44 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు హెల్త్ ఆఫీసర్లను నియమించారు.
23, డిసెంబర్ 2013, సోమవారండిసెంబర్ 23, 2013
నేటి నుంచి భవానీ దీక్షల విరమణ
By Fun Counter
23, డిసెంబర్ 2013, సోమవారం