హైదరాబాద్, డిసెంబర్ 19: భారత దౌత్యాధికారి దేవయానిపై అమెరికా వ్యవహరించిన తీరును నిరసిస్తూ గురువారం వామపక్ష, పలు విద్యార్థి సంఘాలు గురువారం నగరంలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించాయి. దేవయాని పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయమని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. గతంలో రక్షణ మంత్రి ఆంటోని, మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, నటులు కమల్‌హాసన్, షారూక్ ఖాన్ పట్ల కూడా ఇలాగే దురుసుగా వ్యవహరించిందని విమర్శించారు. కేంద్రం తక్షణమే స్పందించి భారత్‌లోని అమెరికన్ కాన్స్‌లేట్, రాయబార కార్యాలయాలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విద్యార్థి సంఘాలు కార్యాలయాన్ని ముట్టడించనున్నాయన్న సమాచారంతో బేగంపేట ఎసిపి మనోహర్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులను అక్కడ మోహరించారు. మధ్యాహ్నం సమయంలో కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చి ఒక్కసారిగా పోలీసుల మీదకు దూసుకెళ్లారు. దీంతో కార్యాలయం ఎదుట కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితులు అదుపు తప్పేలా మారడంతో విద్యార్థులను అదుపులోకి తీసుకుని కార్ఖాన, తిరుమలగిరి, బొల్లారం పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ముట్టడిలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యుతోపాటు భజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్ సంఘాలు పాల్గొన్నాయి.
21, డిసెంబర్ 2013, శనివారండిసెంబర్ 21, 2013
అమెరికా కాన్సులేట్ ముట్టడి యత్నం
By Fun Counter
21, డిసెంబర్ 2013, శనివారం