Recent Posts

గెలుపు ఓటమిలు సహజం :సోనియా

20, డిసెంబర్ 2013, శుక్రవారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందవద్దనిఎన్నికల్లో గెలుపు ఓటమిలు సహజమేనని, కారణాలు సమీక్షించుకుని ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహాళా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారుఈ విషయంలో చాలా వెలితిగా ఉందని సోనియా అన్నారు.

పార్టీలో నాయకుల మధ్య సఖ్యత, క్రమశిక్షణ అవసరం ఉందని సోనియాగాంధీ పేర్కొన్నారు. హామీలపై వెనక్కి తగ్గే పార్టీ కాంగ్రెస్ కాదని తేల్చిచెప్పారు. ఐకమత్యంతో పార్టీలో బలోపేతం చేద్దామని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వినోదం - తాజా - Google వార్తలు