Recent Posts

మోహన్ బాబు, బ్రహ్మానందంల పద్మశ్రీలు వెనక్కి

23, డిసెంబర్ 2013, సోమవారం

అదేదో సినిమాలో బ్రహ్మానందం తన పాత్రకు  చెప్పుకున్ననట్టు తనకు తానె పద్మశ్రీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పదేటట్టుంది. హైదరాబాద్, డిసెంబర్ 23 : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సినీనటులు మోహన్‌బాబు, బ్రహ్మానందంలకు గట్టి షాక్ ఇచ్చింది. కేంద్రం ప్రభుత్వం వారికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను వారం రోజుల్లో వెనక్కి ఇచ్చేయాలని సోమవారం కోర్టు ఆదేశించింది. జాతీయ అవార్డులను స్వంతానికి వాడుకోరాదని అంటూ ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి ఏడాది కిత్రం వీరిపై పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు న్యాయస్థానం స్వీకరించింది. ఏడాదిపాటు వాదోపవాదనలు జరిగిన పిదప ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించింది.

నటుడు, నిర్మాత, దర్శకుడు మోహన్‌బాబు నిర్మించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో పద్మశ్రీని ఇంటిపేరుగా వాడుకున్నారని, అందులో కమెడియన్ నటుడు బ్రహ్మానందం నటించారని, వీరికి ఇచ్చిన అవార్డును దుర్వినియోగం చేశారని ఇంద్రసేనారెడ్డి ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదను సమర్థించిన కోర్టు ఈ మేరకు 2007లో మోహన్‌బాబుకు, 2009లో బ్రహ్మానందంకు కేంద్రం జాతీయ అవార్డులను ప్రదానం చేసిన విషయం తెలిసిందే.

వినోదం - తాజా - Google వార్తలు