శాసన సభ ప్రాంగణంలో పాములు అలజడి రేకెత్తిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సమావేశాలు జరుగుతున్న సమయంలో తరుచూ పాములు కన్పించటంతో అమాత్యులను, సభ్యులను, అధికారులను ఆందోళనకు గురి చేస్తుండగా, శాసనసభ భవన నిర్వహణ విభాగం అధికారుల పనితీరుకు ఇదిఅద్దం పడుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో భాగంగా మీడియాపాయింట్‌కుసమీపంలో మరో పాము దర్శనమిచ్చింది. దాన్ని గమనించి పలువురు ఎమ్మెల్యేలు, పాత్రికేయులు హడావుడి చేసే సరికి అది బండరాళ్ల కిందకు వెళ్లి దాదాపు గంట వరకు కన్పించకుండా పోయింది. అది మామూలు పామే అన్న విషయం తెలియటంతో కలకలం సద్దుమణిగింది. చివరకు శాసనసభ సిబ్బంది జోక్యం చేసుకుని పాములు పట్టే వ్యక్తిని తీసుకుని రావటంతో ఆయన క్షణంలో పామును చేతితో పట్టుకుని సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత అందరూ హమ్మయ్యా..! అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
20, డిసెంబర్ 2013, శుక్రవారండిసెంబర్ 20, 2013
శాసన సభ ప్రాంగణంలో పాములు
By Fun Counter
20, డిసెంబర్ 2013, శుక్రవారం