హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ఒప్పందాన్ని (ఎంవోయూ) నిర్దేశిత వ్యవధిలో అమలు చేయకపోతే ప్రభుత్వం దానికి కేటాయించిన భూమి స్వాధీనానికి ఆదేశిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై వారంలోగా ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ 'స్థాయి నివేదిక' దాఖలు చేయాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ను ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి... నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు చెన్నైకి చెందిన మాస్ ఫ్యాబ్రిక్ పార్క్, ఏషియన్ అపెరల్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ పార్క్ సంస్థలు ముందుకొచ్చాయి. అనంతరం కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం 2006లో ప్రభుత్వం 714 ఎకరాలను వాటికి కేటాయించింది. అయితే, నిర్దేశిత వ్యవధిలో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కాలేదు. అందువల్ల ఆ సంస్థలకు ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ చింతవరం గ్రామవాసి మల్లికార్జున్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
26, డిసెంబర్ 2013, గురువారండిసెంబర్ 26, 2013
టెక్స్ టైల్ పార్క్ భూమి స్వాధీనానికి ఆదేశిస్తాం : హైకోర్టు
By Fun Counter
26, డిసెంబర్ 2013, గురువారం