హైదరాబాద్, డిసెంబర్ 23 : అసోంలో తెలుగు ఇంజనీర్ అంకంరావు కిడ్నాప్‌కు గురయ్యారు. చిరాంగ్ జిల్లా ఆమ్‌గురి వద్ద అంకంరావును దుండగులు కిడ్నాప్ చేశారు. బోడో మిలిటెంట్లే ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్‌పై పోలీసులు మాట్లాడుతూ డబ్బు కోసమే అంకంరావును దుండగులు కిడ్నాప్ చేసి వుంటారని, అయితే ఆయనకు ప్రాణహానీ ఉండదని కుటుంబసభ్యులకు అసోం పోలీసు అధికారులు భరోసా ఇచ్చారు.
బొల్లినేని శ్రీనయ్య కంపెనీలో అంకంరావు పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం జాగర్లమూడివారిపాలెం. అంకంరావు కిడ్నాప్‌తో ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.