Recent Posts

తదుపరి సమావేశాల్లో టి. బిల్

21, డిసెంబర్ 2013, శనివారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు తదుపరి సమావేశాల్లో ప్రతిపాదిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో గురువారం ఇంటెలిజెన్స్ బ్యూరో వార్షిక ఎండోమెంట్ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కాగా, సీమాంధ్ర ప్రాంత ఎంపీల నిరసనల నేపథ్యంలో రెండు రోజులకు ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ప్రోరోగ్ చేయకుండా జనవరిలో మళ్లీ సమావేశాలను నిర్వహించే యోచన ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ బుధవారం చెప్పారు. ఈ నేపథ్యంలోనే మత హింస నిరోధక బిల్లు, తెలంగాణ బిల్లును పార్లమెంటు వచ్చే సమావేశాల్లో తప్పకుండా ప్రతిపాదిస్తామని షిండే చెబుతున్నారు. ఆ సమావేశాలు జనవరి ఆఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. రాష్టప్రతి పంపిన తెలంగాణ బిల్లు ప్రస్తుతం రాష్ట్ర శాసన సభ పరిశీలనలో ఉంది. జనవరి 3 నుంచి జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సి ఉంది. చర్చ జరిపిన అనంతరం శాసనసభ ఆ ముసాయిదా బిల్లును జనవరి 23 లోగా రాష్టప్రతికి తిరిగి పంపాల్సి ఉంది. శాసనసభలో చర్చ జరిగినా, జరగకపోయినా కేంద్ర ప్రభుత్వం జనవరి 23 వరకూ వేచి చూసి, పార్లమెంటు తదుపరి సమావేశాల్లో దానిని ఆమోదించాల్సి ఉంటుంది. మత హింస నిరోధక బిల్లు, తెలంగాణ బిల్లులో ఏది ముందుకు చర్చకు వస్తుందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

వినోదం - తాజా - Google వార్తలు