కాన్పూర్, డిసెంబర్ 18: ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్ తన ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది. ఈ సంస్థకు చెందిన 12 మందికి పైగా విద్యార్థులు కోటి రూపాయలు, అంతకన్నా ఎక్కువ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం తమ సంస్థలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని.. ఇందులో రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య ప్యాకేజీతో పలువురు విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ఐఐటీ ప్లేస్‌మెంట్ విభాగం అధిపతి విమల్‌కుమార్ తెలిపారు. అలాగే, 15 రోజుల్లో 675 మంది విద్యార్థులు ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో 200కు పైగా కంపెనీలు పాల్గొన్నాయి.
20, డిసెంబర్ 2013, శుక్రవారండిసెంబర్ 20, 2013
కాన్పూర్ ఐ ఐ టి విద్యార్థులకు రూ. కోటి వార్షిక వేతనం
By Fun Counter
20, డిసెంబర్ 2013, శుక్రవారం