Recent Posts

ఎన్నికల ఫలితాలు అసంతృప్తి నిచ్చాయి

20, డిసెంబర్ 2013, శుక్రవారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : కొన్ని పార్టీలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నాయని, అలాంటి హామీలను తాము ఇవ్వలేమని, యూపీఏ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ  తాము ఇతర రాజకీయ పార్టీల లాగా సాధ్యం కానీ హామీలను ఇవ్వలేమని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అన్నారు. వాస్తవంగా సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తామని ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా అసంతృప్తి గురి చేశాయని మన్మోహన్ సింగ్ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు నిరుత్సాహానికి లోనుకాకూడదని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంకేతంగా భావించాల్సిన అవసరం లేదని మన్మోహన్ సింగ్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధాన భూమిక నిర్వహిస్తాయని ఆయన  అన్నారు. జాతీయ సమస్యలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనే ఆ ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయని తెలిపారు.

 కాగా తొమ్మిదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని తొలిసారిగా ప్రసంగించటం విశేషం. ఈ సమావేశంలో చిదంబరం, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో డాక్యుమెంటరీ విడుదల చేశారు.

గురి చేశాయని మన్మోహన్ సింగ్ అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు నిరుత్సాహానికి లోనుకాకూడదని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంకేతంగా భావించాల్సిన అవసరం లేదని మన్మోహన్ సింగ్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధాన భూమిక నిర్వహిస్తాయని ఆయన  అన్నారు. జాతీయ సమస్యలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనే ఆ ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయని తెలిపారు.

 కాగా తొమ్మిదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని తొలిసారిగా ప్రసంగించటం విశేషం. ఈ సమావేశంలో చిదంబరం, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో డాక్యుమెంటరీ విడుదల చేశారు.

వినోదం - తాజా - Google వార్తలు