దుబాయ్: వచ్చే ఏడాది జరిగే ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తన పోరును ప్రారంభించనుంది. ఫిబ్రవరి 15న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (డీఐసీఎస్)లో జరిగే గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్.. పాక్‌తో తలపడనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శనివారమిక్కడ షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఫిబ్రవరి 14న మొదలయ్యే ఈ మెగా టోర్నీ.. మార్చి 1న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. 10 ప్రధాన జట్లతో సహా అఫ్ఘానిస్థాన్, కెనడా, నమీబియా, పపువా న్యూ గినియా (పీఎన్‌జీ), స్కాట్లాండ్, యూఏఈ జట్లు కూడా ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లను 4 గ్రూపులగా విభజించనున్నారు. ప్రతీ గ్రూప్ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. ఇక ఇవే గ్రూప్‌ల్లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేట్ చాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనల్లో తలపడనున్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాక్‌తో పాటు స్కాట్లాండ్, పీఎన్‌జీ పోటీపడుతున్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, నమీబియా, గ్రూప్-సిలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, కెనడా, గ్రూప్-డిలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, యూఏఈ తలపడనున్నాయి.
16, డిసెంబర్ 2013, సోమవారండిసెంబర్ 16, 2013
ఫిబ్రవరి నుండి దుబయ్ లో క్రికెట్ టోర్నీ
By Fun Counter
16, డిసెంబర్ 2013, సోమవారం