న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : 2013కు గాను ప్రముఖ తెలుగు రచయిత్రి కాత్యాయని విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 'సాహిత్య రంగంలో సగం' అనే వ్యాసాలకు సాహిత్య అకాడమీ అవార్డును బుధవారం కేంద్రం ప్రకటించింది. ఆమె కేసవరపు రామకోటి శాస్త్రీ కుమారె. కాత్యాయని స్త్రీ సాహిత్యరంగంపై ప్రసంగం పాఠాలు, పలు రచనలు చేశారు. కాత్యాయనీ విద్మహే సాహితీ విమర్శకురాలు.
రచయిత కాత్యాయని వివిధ ధృక్కోణాలలో మహిళలకోసం అనేక రచనలు చేశారు. వాటిలో స్త్రీలు ఉద్యమాలలో పాల్గొనే రచనలు కూడా ఉన్నాయి. మొత్తం ఆమె 28 వ్యాసాలు రాశారు. వాటిలో మొదటి ఐదు రచనలు ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని అర్ధం చేసుకోవడం, స్త్రీలు తమ సమస్యలను ఎదుర్కొవడం వంటి పలు అంశాలతో కూడిన రచనలు చేశారు. ఆమె రచనలు భవిష్యత్తులో అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. వివిధ భాషల్లో 22 మందికి కేంద్ర సాహితీ అవార్డులు కేంద్రం ప్రకటించింది.