న్యూఢిల్లీ: ఈ ఏడాది 'కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం'... భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు లభించింది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటన చేసింది. బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో దీన్ని ఆయనకి అందజేయనున్నారు. చెన్నైలో సమావేశమైన బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, కార్యదర్శి సంజయ్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్ అయాజ్ మెమన్‌లతో కూడిన అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా ఈ హర్యానా ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసింది.
కపిల్‌కు ట్రోఫీతో పాటు ప్రతిమ, రూ. 25 లక్షల చెక్‌ను బహూకరించనున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన కపిల్ భారత్ తరఫున 131 టెస్టులు ఆడి 5,248 పరుగులు చేసి 434 వికెట్లు తీశారు. దీంతో పాటు 5 వేల పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కారు. 225 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టడంతో పాటు 3,783 పరుగులు చేశారు. కీలక మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన కపిల్ కెప్టెన్‌గా 1983 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించారు. 1994లో లాలా అమర్‌నాథ్‌తో మొదలుపెట్టిన ఈ అవార్డును ప్రతీ ఏడాది ఇస్తున్నా రు. 2012లో సునీల్ గవాస్కర్ దీన్ని అందుకున్నాడు.
బోర్డుతో సయోధ్యవల్లే!
భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కపిల్ దేవ్ కొన్నాళ్ల పాటు బీసీసీఐపై తిరుగుబాటు చేశారు. బోర్డు ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 2007లో రెబల్ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీసీసీఐ ఆయనపై నిషేధం వేటు వేసింది. అయినా వెనక్కి తగ్గని కపిల్ కొంతకాలం లీగ్‌తో పాటే నడిచినా...గతేడాది ఐసీఎల్ కు గుడ్‌బై చెప్పారు. దీంతో మాజీ కెప్టెన్ నిర్ణయాన్ని స్వాగతించిన బోర్డు ఆయన్ని మెల్లమెల్లగా తమవైపు తిప్పుకుంది. పెన్షన్ స్కీమ్‌తో పాటు మాజీ ఆటగాళ్లకు ఇచ్చే ఏక మొత్తం ప్రయోజనం కింద రూ. 1.5 కోట్లను అందజేసింది. తాజాగా ఈ అవార్డును ప్రకటించింది.
20, డిసెంబర్ 2013, శుక్రవారండిసెంబర్ 20, 2013
కపిల్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం
By Fun Counter
20, డిసెంబర్ 2013, శుక్రవారం