త్రీడీ తుపాకులు, త్రీడీ గృహోపకరణాలు, త్రీడీ అవయవాలు.. అన్నీ అయ్యాయి! ఇప్పుడిక కార్లవంతు. త్రీడీ విధానంలో ముద్రించి అతికిన పర్యావరణప్రియ కారు. దీనిపేరు అర్బీ 2. అయితే, దీని పైభాగాలు మాత్రమే త్రీడీలో ముద్రించిన ప్లాస్టిక్ విడి భాగాలు. ఇంజన్, ఛాసీ మాత్రం నిజమైన లోహాలతో రూపొందినవే. అమెరికాకు చెందిన కోర్ ఎకలాజిక్ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. దీని బరువు ఇంచుమించు 544 కిలోలు. చక్రాలు మాత్రం మూడే! 37 లీటర్ల ఇథనాల్ ఇంధనంతో ఇది 4900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని అంచనా.