అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఓ భారతీయుడు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుందా? అవునంటున్నారు అక్కడి నాయకులు. 2016లో అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుడు, ప్రస్తుత లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ పోటీ పడతారని ఆ రాష్ట్రానికి చెందిన ఓ సెనేటర్ చెబుతున్నారు. ఆయన తప్పకుండా పోటీ చేస్తారని, ఆయన చాలా మంచి అభ్యర్థి అని సెనేటర్ డేవిట్ విటెర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు బాబీ జిందాల్ అంటే ఇష్టమని, ఆయన నాయకత్వం అంటే గౌరవం ఉందని, ఆయన రాజకీయ విలువలన్నింటితో తాను ఏకీభవిస్తానని చెప్పారు.
23, డిసెంబర్ 2013, సోమవారండిసెంబర్ 23, 2013
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాబీ జిందాల్!
By Fun Counter
23, డిసెంబర్ 2013, సోమవారం