Recent Posts

8pm NEWSFEED

26, డిసెంబర్ 2013, గురువారం

8pm NEWSFEED


బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ కోర్సులు

Posted: 26 Dec 2013 01:03 AM PST

Categories:

బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ కోర్సులన్నీ ఇప్పటి వరకు ఇంటర్ ఎంపిసి విద్యార్థులకు ఉద్దేశించినవే. ఇప్పుడు బయాలజీ విద్యార్థులకు కూడా అవ కాశం కల్పిస్తున్నది ఈ సంస్థ. ఈ కోర్స్ చేసిన వారికి ఉద్యోగ అవకా శాలు చాలా బాగుంటాయి. మెడిసిన్, బిడిఎస్‌లో వంటి కోర్సుల్లో సీటు లభించిన బయాలజీ విద్యార్థులకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. వాటికి దీటుగా ఈ కోర్సు ఉంటుంది. బిట్స్ పిలానీ . వివిధ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తోంది. ఎమ్మెస్సీ ఆనర్స్ [...]

(Read more...)

‘రైల్వే లో ‘ పీజీ కోర్స్

Posted: 26 Dec 2013 12:54 AM PST

Categories:

మన ఆర్థి వ్యవస్థకు జవజీవాలను అందించేది భారత రైల్వే. ప్రపంచంలోనే అతి పెద్ద నెట్‌వర్క్‌గా దీనికి పేరుంది. సుమారు పద్నాలుగు లక్షల మంది సిబ్బందితో అలరారుతున్న మన రైల్వే ఈ ఏడాది ఏప్రిల్‌కి 160 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మన దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పించే సంస్థ కూడా రైల్వే మాత్రమే. రైలు అలాగే మెట్రో ఇండస్ట్రీ కోణంలో చూస్తే శిక్షణ పొందిన మానవవనరులకు సంబంధించి అంతరం చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీ మెట్రో రైల్ [...]

(Read more...)

అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థ- ‘బిట్స్

Posted: 26 Dec 2013 12:52 AM PST

Categories:

అత్యున్నత మౌలిక సదుపాయాలకు తోడు కాలానుగుణంగా కరికులమ్‌లో మార్పులు చేస్తూ భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యనందించే అత్యుత్తమ విద్యాసంస్థల్లో ‘బిట్స్ పిలానీ‘ అగ్రస్థానంలో నిలుస్తోంది. బిట్స్ ఒక్క సబ్జెక్టు చదువుకే పరిమితం కాదు. సబ్జెక్టులో అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ సైతం విద్యార్థికి లభించేలా చూస్తుంది. ఈ సంస్థలో చేరాలంటే బిట్స్ నిర్వహించే ప్రవేశపరీక్ష బిట్స్ ఎట్ (బిట్స్ అడ్మిషన్ టెస్ట్)లో ర్యాంకు తెచ్చుకోవాలి. బిట్స్ ఎట్ -2014 నోటిఫికేషన్ విడుదలైంది. బిట్స్ ఎట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్ష. [...]

(Read more...)

దిగొస్తున్న అమెరికా

Posted: 26 Dec 2013 12:39 AM PST

Categories:

వాషింగ్టన్/న్యూయార్క్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై అమెరికా వ్యవహరించిన తీరుకు ప్రతిచర్యగా ఆ దేశ కాన్సులేట్ సిబ్బందికి తీవ్ర నేరాల్లో కల్పిస్తున్న దౌత్యపరమైన న్యాయ రక్షణను భారత్ కుదించిన నేపథ్యంలో అగ్రరాజ్యం దిగొస్తోంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో పనిమనుషుల నియామకం అంశం కూడా ఉంటుందని బుధవారం ప్రకటించింది. అలాగే దేవయాని అరెస్టుతో తలెత్తిన దౌత్య వివాదానికి పరిష్కారంపై ముందడుగు విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా [...]

(Read more...)

సమైక్యానికి మద్దతివ్వండి: వైఎస్ జగన్

Posted: 26 Dec 2013 12:36 AM PST

Categories:

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ..తాను, మరో ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, 23 ఎమ్మెల్యేలందరూ, డిస్ క్వాలిఫై అయిన 13 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలమందరం కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  అఫిడవిట్ ను అందచేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.  సమైక్యానికి తోడుగా నిలబడుతారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలపై ఆలస్యంగా వేటు వేశారని జగన్ అన్నారు.    ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినపుడు అనర్హత వేటు వేయకుండా.. [...]

(Read more...)

ఎన్టీఆర్ భవన్ లో బాహాబాహీ

Posted: 26 Dec 2013 12:26 AM PST

Categories:

హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్ సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి ముందు కృష్ణాజిల్లా కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. జిల్లాలోని పెనమలూరు నియోజవర్గంలో టీడీపీ వర్గపోరుతో కుతకుతలాడుతోంది. పార్టీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్, దివంగత చలసాని పండు వర్గానికి చెందిన బోడే ప్రసాద్, వల్లభనేని వెంకటేశ్వరరావు (నాని)ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.దీంతో గత నాలుగేళ్లుగా పార్టీ ఇన్‑ఛార్జీనే నియమించలేని పరిస్థితి నెలకొంది.  ఈ రెండు వర్గాలు వేర్వేరుగా [...]

(Read more...)

వంగవీటి రంగాకు నివాళి

Posted: 26 Dec 2013 12:22 AM PST

Categories:

విజయవాడ, డిసెంబర్ 26 : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్దంతి సందర్భంగా గురువారం ఉదయం రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయాలను సాంధించేందుకు ప్రజా సమస్యలపై పోరాడుతాన న్నారు. రంగా మిత్ర మండలికి అండగా నిలిచిన వారందరికీ వంగవీటి రాధ కంటతడిపెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

(Read more...)

రాష్ట్ర సమైక్యం కోసం జగన్ అఫిడవిట్లు

Posted: 26 Dec 2013 12:21 AM PST

Categories:

హైదరాబాద్, డిసెంబర్ 26 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అఫిడవిట్లు అందజేశామని వైసీపీ అధినేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కలిసి అఫిడవిట్లు ఇచ్చినట్లు తెలిపారు.   రాష్ట్ర సమైక్యం కోసం మిగతా పార్టీలు కూడా అఫిడవిట్లు ఇవ్వాలని జగన్ కోరారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. సమైక్యవాదినంటూ [...]

(Read more...)

బాబుబలి షూటిం గ్ కు ప్రజా నిరసన

Posted: 25 Dec 2013 10:42 PM PST

Categories:

హైదరాబాద్:ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి షూటింగ్‑ను అడ్డకుంటామని అనాజ్‑పూర్‑ ప్రజలు హెచ్చరిస్తున్నారు. హయత్ నగర్ మండలం అనాజ్‑పూర్‑లో చిత్ర షూటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసుకున్ననేపథ్యంలో ప్రజల నుంచి నిరసన గళం వినిపించింది. ఇక్కడ షూటింగ్ చేయడానికి గ్రామ పంచాయతీ అనుమతి లేని కారణంగానే సినిమా ను అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు  అక్కడకు భారీ పోలీసు బలగాలను తరలించారు.    జానపద [...]

(Read more...)

సిబిఐ డైరెక్టర్‌కు మరిన్ని అధికారాలు

Posted: 25 Dec 2013 10:39 PM PST

Categories:

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సిబిఐకి మరింత స్వయంఫ్రతిపత్తి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓ ముఖ్యమైన చర్య తీసుకుంది. ఇప్పటివరకు న్యాయ శాఖకు రిపోర్టు చేస్తూ వచ్చిన సిబిఐ ప్రాసిక్యూషన్ విభాగాన్ని సిబిఐ డైరెక్టర్ ఆధిపత్యం కిందికి తీసుకు వచ్చింది. దీంతో ఇక దర్యాప్తుల విషయంలో సిబిఐ డైరెక్టర్ మాటే చివరిది కానుంది. సిబిఐ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను ఇప్పుడు సంస్థ డైరెక్టర్ కింద ఉంచారని, గతంలో న్యాయ శాఖ చేస్తున్నట్లుగా ఇప్పుడు డైరెక్టర్ ఈ విభాగం సిబ్బంది [...]

(Read more...)

వినోదం - తాజా - Google వార్తలు