Recent Posts

8pm NEWSFEED

25, డిసెంబర్ 2013, బుధవారం

8pm NEWSFEED


డబ్బు సంపాదన కోసం- దోపిడీ : చిత్రసమిక్ష

Posted: 25 Dec 2013 01:55 AM PST

Categories:

నలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. పలు రకాలుగా ఈజీ మనీ కోసం ప్లాన్ వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి ప్లాన్ వేస్తారు.  దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా బ్యాంక్ లోనే ఇరుక్కుపోతారు. దోపిడి జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ ను చుట్టుముడుతారు. బ్యాంకులో చిక్కుకుపోయినా నలుగురు కుర్రాళ్లు పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డారు? బ్యాంక్ దోపిడి సంఘటనలో   నలుగురు కుర్రాళ్లు [...]

(Read more...)

శాంతాక్లాజ్ గా శివప్రసాద్

Posted: 25 Dec 2013 01:49 AM PST

Categories:

చిత్తూరు, డిసెంబర్ 25 : వినూత్న వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే జిల్లా ఎంపీ శివప్రసాద్ క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం ఉదయం క్రిస్మస్ తాత వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. గాంధీ విగ్రహం వద్ద అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యాంధ్ర పేరున్న చాకెట్లను చిన్నారులకు పంచిపెట్టారు.

(Read more...)

బస్ లో చెలరేగిన మంటలు

Posted: 25 Dec 2013 01:47 AM PST

Categories:

అనంతపురం, డిసెంబర్ 25 : జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లో కలకలం రేగింది. బుధవారం ఉదయం కదిరికి వెళ్లేందుకు బయలేదేరిన ఓ బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి, ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి బయటకు దింపివేశారు. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

(Read more...)

పెరగనున్న చలి

Posted: 24 Dec 2013 08:47 PM PST

Categories:

విశాఖపట్నం, డిసెంబర్ 24 : రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తెలంగాణలలో పొడి వాతావరణం నెలకొంది. కోస్తాలో అక్కడక్కడ పాక్షికంగా మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఇదే సమయంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. మధ్య భారతం మీదుగా గాలుల తీవ్రత తగ్గింది. దీంతో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటిరెండు డిగ్రీలు అటుఇటూగా నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో స్వల్పంగా చలి పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.

(Read more...)

పూరి తీరంలో అతిపెద్ద సైకత జీసస్ విగ్రహం

Posted: 24 Dec 2013 08:44 PM PST

Categories:

భువనేశ్వర్:  : ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుతం సృష్టించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీసస్ ప్రతిమను రూపొందించారు. పూరి తీరంలో 35×75 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం వెయ్యి టన్నుల రంగుల మిశ్రమంతో కూడిన ఇసుకను వాడారు. పట్నాయక్ 25 మంది శిష్యులతో కలసి మూడు రోజుల్లో తయారు చేశారు. జీసస్ తో పాటు మేరీ మాత, శాంతా క్లాజ్ తో కూడిన విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది. [...]

(Read more...)

బిజెపిలో ఉత్సాహం

Posted: 24 Dec 2013 06:46 PM PST

Categories:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, బిల్లు అభిప్రాయసేకరణకు శాసనసభలో ప్రవేశపెట్టడంతో పాటు మరో పక్క ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గణనీయమైన విజయాలను నమోదు చేసుకోవడంతో రాష్ట్ర బిజెపిలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ పేరును చాలా ముందుగానే ప్రకటించడంతో బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఓట్లను రాబట్టుకోవడం ద్వారా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ బిజెపికి 2013 చారిత్రాత్మక [...]

(Read more...)

పర్యావరణ మంత్రిగా వీరప్ప మొయిలీ అదనపు బాధ్యతలు స్వికరణ

Posted: 24 Dec 2013 06:34 PM PST

Categories:

న్యూఢిల్లీ  : దేశంలో పచ్చదనం పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తానని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పర్యావరణం, అడవులు అనేవి మనిషి జీవితంలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. అవి వాతావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిగా అదనపు బాధ్యతలు మంగళవారం వీరప్ప మొయిలీ స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ [...]

(Read more...)

బ్రిటన్, ఫ్రాన్స్ ల లో తుఫాను బీభత్సం

Posted: 24 Dec 2013 02:01 PM PST

Categories:

లండన్, డిసెంబర్ 24: తీవ్రమైన పెనుతుఫాను బ్రిటన్, ఫ్రాన్స్‌లను అతలాకుతలం చేసింది. గంటకు 90 మైళ్ల వేగంతో ప్రచండ గాలులు వీయడంతోపాటు అతి భారీ వర్షాలకు ఐదుగురు మరణించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడడంతో క్రిస్మస్ ప్రయాణాలకు, షాపింగ్‌కు ఆటంకం ఏర్పడింది. విమానాలు రద్దవడంతో లండన్, పారిస్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. దక్షిణ బ్రిటన్‌లో అనేక రైళ్లను రద్దు చేశారు. లండన్‌కు రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఫ్రాన్స్‌లో అన్ని రైళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారానికి [...]

(Read more...)

పదోన్నతులపై ఐ ఎ ఎస్ లకు పరిక్షలు

Posted: 24 Dec 2013 01:57 PM PST

Categories:

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలంటే సివిల్స్ రాయాలి. పరీక్ష నుంచి ఇంటర్వ్యూ దాకా వేర్వేరు దశల్లో సాగే ఎంపిక ప్రక్రియలో పాల్గొని..నెగ్గితేనే సర్వీస్ కొట్టినట్టు! కానీ, సర్వీసులో చేరిన తరువాత కూడా, పరీక్ష రాయాల్సి వస్తే? అదీ మళ్లీ తొలి గడి నుంచి నడక మొదలుపెట్టాల్సి వస్తే?.. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కేంద్రం ఇటీవల చేసిన మార్పులుచేర్పులు చూస్తే, రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్, ఐపీఎస్, [...]

(Read more...)

అమెరికా దౌత్య అధికారులకు ‘గుర్తింపు’ రద్దు

Posted: 24 Dec 2013 01:50 PM PST

Categories:

న్యూఢిల్లీ/వాషింగ్టన్, డిసెంబర్ 24: దేవయాని ఖోబ్రాగడే వ్యవహరంతో అమెరికా, భారత్ మధ్య మొదలైన దౌత్య యుద్ధం కొనసాగుతోంది. అమెరికా చర్యలకు దీటుగా భారత్ ప్రతిస్పందిస్తోంది. భారత్‌లోని అమెరికా దౌత్య అధికారుల దౌత్య హోదాకు కత్తెర వేయాలని, వారి కుటుంబ సభ్యులకు కల్పించిన దౌత్యహోదానూ రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలోని భారత దౌత్యవేత్తలకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోందో.. భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తలకు కూడా అటువంటి సౌకర్యాలనే కల్పించాలని నిర్ణయించింది. అమెరికా దౌత్య అధికారులకు [...]

(Read more...)

వినోదం - తాజా - Google వార్తలు