Recent Posts

8pm NEWSFEED

24, డిసెంబర్ 2013, మంగళవారం

8pm NEWSFEED


మ్యాచ్ ఆడుతూ ఫుట్‌బాల్ క్రీడాకారుడి మృతి

Posted: 23 Dec 2013 09:35 PM PST

Categories:

లండన్, డిసెంబర్ 23: జెమీ స్కిన్నర్ అనే 13 ఏళ్ల ఫుట్‌బాలర్ అండర్-14 విభాగంలో ఓ మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలి మృతి చెందాడు. ఫెర్నీసైడ్ పట్టణంలోని సౌటన్ ఆస్ట్రో మైదానంలో జరిగిన ఈ సంఘటనను బిబిసి ప్రకటించింది. అతని మృతికి కారణాలు తెలియలేదని పేర్కొంది. మ్యాచ్ ఆడుతూ కుప్పకూలిన జెమీకి ప్రాథమిక చికిత్స జరిపినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది.

(Read more...)

8 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

Posted: 23 Dec 2013 09:29 PM PST

Categories:

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలం గోలుపల్లి అడువుల్లో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న వాహనాన్ని మంగళవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో తరలిస్తున్న 8లక్షల రూపాయల విలువైన 40ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. టాటా ఏస్ వాహనాన్నిసీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

(Read more...)

శ్రీవారి బూందీ పోటులో కలకలం

Posted: 23 Dec 2013 09:27 PM PST

Categories:

తిరుపతి, డిసెంబర్ 23: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న లడ్డూ తయారీకి ఉపయోగించే బూందీ చేసే వంటశాలలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. అగ్ని నిరోధక సిలిండర్‌లోని కెమికల్ ఏజెంట్ డ్రై పౌడర్ విడుదల కావడంతో ఈ కలకలం చెలరేగింది. గ్యాస్ లీకైందని భావించిన సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. లడ్డూకు ఉపయోగించే ముడి సరకుల్లో ఒకటైన బూందీని తయారు చేసేందుకు టిటిడి ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్ వెనుక ప్రత్యేక పాకశాలను ఏర్పాటు చేసిన [...]

(Read more...)

హార్మోన్ల పెరుగుదలకు జింక్ దోహదకారి

Posted: 23 Dec 2013 09:23 PM PST

Categories:

మీ రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు.. అంటే విటమిన్లు, కాల్షియం, ఐరన్ అంటూ కొన్నింటి గురించి మాత్రమే చాలామంది చెబుతారు. వాటిలో జింక్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ జింకు లోపంవల్ల కూడా బోలెడు సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుందట. మన శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు జీవ క్రియల వేగం స్థిరంగా ఉండటానికి, రోగ నిరోధక శక్తి పెంపొందడానికి, వాసన, రుచి వంటి జ్ఞానాలు తగ్గకుండా ఉండడానికి జింక్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా [...]

(Read more...)

అప్పుల పంపకాలు ఎలా?

Posted: 23 Dec 2013 09:21 PM PST

Categories:

హైదరాబాద్, డిసెంబర్ 23: విభజన జరిగితే అప్పులను ఇరు ప్రాంతాలకు ఎలా పంపిణీ చేయాలన్న అంశంపై సందిగ్దత కొనసాగుతోంది. లక్షల కోట్ల రూపాయల అప్పులను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అనుసరించాల్సిన గణనను ఎంపిక చేసుకోవడంలో ఇంకా నిర్ధిష్టమైన నిర్ణయానికి కేంద్రం రాలేకపోయింది. కొన్ని ఆర్ధిక పంపకాల్లో ఇప్పటికీ 1971 జనాభా గణననే ఆధారంగా తీసుకుంటుండగా, ఇప్పుడు 2011 జనాభా గణాంకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేని ఆధారంగా [...]

(Read more...)

మరో రియల్ ఎస్టేట్ మోసం

Posted: 23 Dec 2013 09:18 PM PST

Categories:

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కోమలి రియల్ ఎస్టేట్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి ఇప్పుడు కాస్తా అందరికీ టోపీ పెట్టేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంస్థకు విశాఖపట్నం, తూర్పుగోదవరి జిల్లాలలో బ్రాంచీలు ఉన్నాయి. సంస్థ చేసిన మోసం తెలియడంతో ఇన్నాళ్లుగా ఈ సంస్థలో ఏజెంటుగా పనిచేసిన సోమరాజు అనే వ్యక్తి [...]

(Read more...)

సజావుగా మార్స్ ఆర్బిటర్

Posted: 23 Dec 2013 03:35 PM PST

Categories:

చెన్నై, నవంబర్ 6: అంగారకుడిని శోధించడానికి ప్రయోగించిన ఉపగ్రహం ‘మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)’ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. భూ స్థిర కక్ష్యలో ఉన్న ఈ ఉపగ్రహాన్ని గురువారం ఉదయం మరికొంత ఎత్తుకు చేర్చనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం తొలి పరిభ్రమణంలో ఉన్న మార్స్ ఆర్బిటర్ ఈ నెలాఖరుకల్లా భూమి చుట్టూ ఐదు సార్లు తిరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత సూర్యానువర్తిత కక్ష్యలోకి మారి సూర్యుడి చుట్టూ తిరుగుతూ క్రమంగా అంగారక కక్ష్యలోకి ఉపగ్రహం [...]

(Read more...)

కిరణ్‌కు ఢిల్లీ పిలుపు!

Posted: 23 Dec 2013 03:27 PM PST

Categories:

హైదరాబాద్ :శుక్రవారం సమన్వయ కమిటీ భేటీ! అదే రోజు కోర్ కమిటీ భేటీ! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఢిల్లీ పిలుపు! సీఎంగా కిరణ్‌కు ఇదే చివరి పర్యటనా!? కిరణ్‌తో చివరిసారి మాట్లాడి నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోందా!? ఆయన ససేమిరా అంటే ‘ప్లాన్ బి’తో రెడీగా ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమిస్తున్నాయి ఢిల్లీ వర్గాలు! రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనతో చివరిసారి మాట్లాడి నచ్చజెప్పేందుకు [...]

(Read more...)

భవానీ దీక్షల విరమణ ప్రారంభం

Posted: 23 Dec 2013 03:21 PM PST

Categories:

విజయవాడ, డిసెంబర్ 23 : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సోమవారం ఉదయం మొదలైంది. ఈవో త్రినాథ్ హోమగుండం వెలిగించి దీక్షల విరమణను ప్రారంభించారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భవానీ దీక్షల విరమణకు భక్తులు కొండపైకి రావడంతో క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోయాయి. ఈనెల 27 వరకు దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగనుంది

(Read more...)

త్రీడీ కారు

Posted: 23 Dec 2013 02:12 PM PST

Categories:

త్రీడీ తుపాకులు, త్రీడీ గృహోపకరణాలు, త్రీడీ అవయవాలు.. అన్నీ అయ్యాయి! ఇప్పుడిక కార్లవంతు. త్రీడీ విధానంలో ముద్రించి అతికిన పర్యావరణప్రియ కారు. దీనిపేరు అర్బీ 2. అయితే, దీని పైభాగాలు మాత్రమే త్రీడీలో ముద్రించిన ప్లాస్టిక్ విడి భాగాలు. ఇంజన్, ఛాసీ మాత్రం నిజమైన లోహాలతో రూపొందినవే. అమెరికాకు చెందిన కోర్ ఎకలాజిక్ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. దీని బరువు ఇంచుమించు 544 కిలోలు. చక్రాలు మాత్రం మూడే! 37 లీటర్ల ఇథనాల్ ఇంధనంతో ఇది [...]

(Read more...)

వినోదం - తాజా - Google వార్తలు