| సీఎంగా కేజ్రీవాల్.. 26న ప్రమాణ స్వీకారం Posted: 22 Dec 2013 11:51 PM PST | Categories: న్యూఢిల్లీ : సామాన్యుడు ఢిల్లీ గద్దె ఎక్కుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26వ తేదీ గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్‑మంతర్‑లోనే ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‑ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పదిహేను సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, [...] |
|
| ఉత్కంఠ నడుమ తొలిటెస్ట్ డ్రా Posted: 22 Dec 2013 08:50 PM PST | Categories: ఎన్నెన్నో మలుపులు… మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు… ఒకరివైపు మొగ్గిన విజయం అంతలోనే మరొకరి పక్షాన నిలుస్తూ వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆఖరి బంతి వరకు టెస్టు క్రికెట్‌లో ఫలితం కోసం ఎదురు చూడాల్సి రావడం అంటే ఆ మ్యాచ్ గొప్పతనం ఏమిటో అర్థ్ధమవుతోంది. చివరి రోజు విజయానికి దక్షిణాఫ్రికా చేయాల్సిన పరుగులు 320… భారత్‌కు 8 వికెట్లు… మ్యాచ్ మన వైపే ఉంది. 197 వద్ద నాలుగో వికెట్ పడింది…. ఫర్వాలేదు, భారత్ ఇంకా విజయానికి [...] |
|
| సిరీస్ న్యూజిలాండ్ కైవసం Posted: 22 Dec 2013 08:40 PM PST | Categories: హామిల్టన్: ఆల్‌రౌండ్ నైపుణ్యంలో అదరగొట్టిన న్యూజిలాండ్… దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 6/0తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 40.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. ఫుల్టన్ (10) [...] |
|
| నేటి నుంచి భవానీ దీక్షల విరమణ Posted: 22 Dec 2013 08:26 PM PST | Categories: విజయవాడ, డిసెంబర్ 22: ఎంతో భక్తిశ్రద్ధలతో 41 రోజుల పాటు దీక్షలో కొనసాగిన భవానీ భక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి తమ దీక్షలను విరమించడానికి బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు జరిగాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను గుర్తు చేసేలా ఆదివారం రాత్రి నుంచే ఇంద్రకీలాద్రి ధగధగాయమనంగా రంగురంగుల విద్యుద్దీపాలతో అలరారుతున్నది. మరో వైపు కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధి వరకు క్యూలైన్ల నిర్మాణం [...] |
|
| మైనారిటీయిజం, కమ్యూనలిజం కాంగ్రెస్ సంప్రదాయాలు Posted: 22 Dec 2013 08:07 PM PST | Categories: ముంబై:మోడీ మళ్లీ గర్జించారు. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో నిర్వహించిన ‘మహాగర్జన‘లో ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గుజరాత్‑లో 365 రోజులూ, రోజుకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దాని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సభకు ప్రత్యేకంగా పదివేల మంది చాయ్‑వాలాలను బీజేపీ ఆహ్వానించింది. ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు మోడీ మైనపు విగ్రహాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‑నాథ్ సింగ్ ఆవిష్కరించారు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు కారణం ఇక్కడి [...] |
|
| గుంటూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా జయదేవ్? Posted: 22 Dec 2013 08:03 PM PST | Categories: గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పేరును అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో గల్లా జయదేవ్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు అధినేత స్పష్టం చేశారు. అసెంబ్లీ సెగ్మంట్లలోని పార్టీనేతలు కూడా గల్లాకు అనుకూలంగా ఉండటంతో అతని పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పేరును అధినేత పరిశీలించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో ఆయనకు [...] |
|
| స్వదేశానికి తరలించండి : సూడాన్ ప్రవాస భారతీయుల వినతి Posted: 22 Dec 2013 04:22 PM PST | Categories: హైదరాబాద్: ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ దేశంలో రెండు తెగల మధ్య తాజాగా మొదలైన అంతర్యుద్ధం అక్కడ నివసిస్తున్న సుమారు 450 మంది భారతీయులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. తమకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న వారంతా భారత ప్రభుత్వం తమను ఆదుకోవాలం టూ వేడుకుంటున్నారు. ప్రత్యేక విమానాల్లో తమను వెంటనే స్వదేశానికి తరలించాలని కోరుతున్నారు. అయితే దీనిపై అక్కడి మన రాయబార కార్యాలయం ఇప్పటివరకూ స్పందించలేదు. తమ దయనీయ స్థితిని ఓ బాధితుడు ఇలా [...] |
|
| ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎ ఎ పి యత్నాలు Posted: 22 Dec 2013 04:21 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైఢిల్లీవాసుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్నసభలు తుది దశకు చేరుకున్నాయి. ‘ఇప్పటి వరకు పలు నియోజకవర్గాల్లోనిర్వహించిన సభల్లో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అత్యధికశాతం ప్రజలుకోరుకుంటున్నారు. ఇంకా పలు నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్నితెలుసుకోవాల్సి ఉంది. అన్నిటినీ పూర్తి చేసి సోమవారం తుది నిర్ణయంతీసుకుంటాం.‘ అని ఏఏపీ నాయకుడు మనీష్ సిసోడియా వెల్లడించారు. మరోవైపుఎస్ఎంఎస్‌లు, పార్టీ వెబ్‌సైట్ ద్వారా కూడా ప్రజాభిప్రాయాన్నిసేకరిస్తున్నారు. ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేస్రీవాల్ [...] |
|
| ముజఫర్‌నగర్ లో రాహుల్ పర్యటన: బాధితులకు పరామర్శ Posted: 22 Dec 2013 04:17 PM PST | Categories: ముజఫర్‌నగర్:అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముజఫర్‌నగర్ బాధితులకు హితవు చెప్పారు. ముజఫర్‌నగర్‌లో ఆదివారం రాహుల్ ఆకస్మికంగా పర్యటించారు. ఇప్పటికీ శిబిరాల్లోనే ఉంటున్న బాధితులను పరామర్శించారు. శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిందిగా సూచించారు. బాధితులు ఇంకా శిబిరాల్లోనే ఉండాలని మత ఘర్షణలకు కారకులైన వారు కోరుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. అయితే, తిరిగి తమపై దాడులు జరిగే అవకాశాలున్నాయని, అందువల్ల గ్రామాలకు వెళ్లబోమని పలువురు బాధితులు [...] |
|
| పీచు పదార్థాలతో గుండె జబ్బులు దూరం Posted: 22 Dec 2013 04:13 PM PST | Categories: లండన్:పీచు పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా హృదయకోశసంబంధమైన వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలోవెల్లడైంది. రెండు దశాబ్దాలుగా ప్రచురించిన పలు పరిశోధనా పత్రాలను లీడ్స్యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న పళ్ళు, కూరగాయలను ప్రతిరోజూ (రోజుకు ఏడు గ్రాములచొప్పున) తీసుకోవడం కార్డియోవాస్కులర్ డిసీజెస్ (సీవీడీ), కరొనరీ హార్ట్డిసీజెస్ (సీహెచ్‌డీ) వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం గమనించామనివారు తెలిపారు. |
|