Recent Posts

8pm NEWSFEED

22, డిసెంబర్ 2013, ఆదివారం

8pm NEWSFEED


గిన్నిస్ బుక్‌లోకి మెగా వైద్య శిబిరం

Posted: 21 Dec 2013 11:56 PM PST

Categories:

ఠాణే: నవీముంబైలోని డీవైపాటిల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన భారీ వైద్యశిబిరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు పుస్తకంలో చోటుసంపాదించుకుంది. ఈ విషయాన్ని శ్రీనానాసాహెబ్ ధర్మాధికారి ప్రతిష్టాన్ సంస్థకు చెందిన నిర్వాహకుడొకరు శనివారం వెల్లడించారు. ముంబై, ఠాణే, పుణేలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 1,50,00 మంది ఈ శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. రాయ్‌గఢ్‌కి చెందిన దివంగత నానాసాహెబ్ ధర్మాధికారి కుమారుడు, ఆధ్యాత్మిక గురువు అప్పాసాహెబ్ ధర్మాధికారి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 1,200 మంది [...]

(Read more...)

సమైక్య జె ఎ సి యత్నం విఫలం

Posted: 21 Dec 2013 11:33 PM PST

Categories:

హైదరాబాద్, డిసెంబర్ 21: ‘సమైక్యాంధ్ర జేఏసీ‘ ఏర్పాటు చేసి… ఉమ్మడిగా ఉద్యమించాలన్న ఏపీఎన్జీవోల యత్నాలు ఫలించలేదు. మరికొన్ని నెలల్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికిప్పుడు రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయలేమని… ఒకవేళ ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం ఉండబోదని కొన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయి. అయితే… ఉమ్మడి జేఏసీ లేకపోయినా ప్రస్తుతం విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో వర్గాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నాయి. అందువల్ల జేఏసీ ఏర్పాటు అంత ముఖ్యం కాదని తేల్చేశాయి. [...]

(Read more...)

రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత

Posted: 21 Dec 2013 11:29 PM PST

Categories:

కడప : చిత్తూరు జిల్లా శేషాచల కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసిన నేపథ్యంలో వారి ఆట కట్టించేందుకు పోలీసులు,  అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగారు. అందులోభాగంగా రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పలు చెక్‑పోస్ట్‑లు, జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తు, దాడులు చేస్తున్నారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట సమీపంలో అక్రమంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అనంతరం స్మగ్లర్లతోపాటు [...]

(Read more...)

త్రీడిలో మహాభారతం, షోలే

Posted: 21 Dec 2013 11:20 PM PST

Categories:

మన చరిత్రలో, సంస్కృతిలో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలోపెట్టుకుని.. అధునిక హంగుల్ని జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిఅందించేందుకు త్రీడీ టెక్నాలజీతో మహాభారతాన్ని యానిమేషన్ చిత్రంగారూపొందించారు త్రీడీటెక్నాలజీ, యానిమేషన్‌తోపాటు బాలీవుడ్ అగ్రతారలను కూడారంగంలోకి దించారు.     భీష్మ పితామహుడి పాత్రకు సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, శ్రీకృష్ణునిపాత్రకు శతృఘ్న సిన్హా, భీమునికి సన్నీ డియోల్, అర్జునునికి అజయ్ దేవగన్, కర్ణునికి అనిల్ కపూర్, ఆదిశక్తి దుర్గకు మాధురీ దీక్షిత్, ద్రౌపదికివిద్యాబాలన్, శకునికి అనుపమ్ ఖేర్, ధర్మరాజుకి మనోజ్ బాజ్‌పేయ్, కుంతికిదీప్తి [...]

(Read more...)

వృత్తి విద్యా కోర్సుల వెబ్ కౌన్సిలింగ్ లో సంస్కరణలు

Posted: 21 Dec 2013 11:18 PM PST

Categories:

హైదరాబాద్, డిసెంబర్ 21: ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల కోసం ప్రస్తుతం అనుసరిస్తోన్న వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ విధానాన్ని ఇకపైనా కొనసాగించటమే మంచిదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అడ్మిషన్లలో సమయం ఆదా కావటం, అత్యున్నత టెక్నాలజీ వినియోగమే ఇందుకు కారణమని తేల్చింది. ప్రస్తుత కౌన్సెలింగ్ విధానంలో అభ్యర్థులకు ఇస్తున్న స్క్రాచ్ కార్డులను కొందరు బ్రోకర్లు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఉన్నత విద్యా మండలి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. [...]

(Read more...)

టెక్సాస్ మంత్రిగా భారత సంతతి మహిళ

Posted: 21 Dec 2013 11:18 PM PST

Categories:

వాషింగ్టన్, డిసెంబర్ 21 : అమెరికాలో మరో భారతీయ-అమెరికన్ వ్యక్తి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం టెక్సాస్‌లో ప్రముఖ న్యాయవాదిగా ఉన్న నందితా వెంకటేశ్వరన్ బెర్రీ(45) … టెక్సాస్ రాష్ట్ర 109వ విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. వచ్చే నెల 7న ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. ఆ రాష్ట్రంలో మూడో అత్యున్నతమైన పదవిగా చెప్పే స్థానంలో ఒక భారతీయ-అమెరికన్‌ను నియమించడం ఇదే తొలిసారి. ఈ బాధ్యతలతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా, రాష్ట్ర, అంతర్జాతీయ వ్యవహారాల్లో [...]

(Read more...)

డీజీపీకి పరీక్ష

Posted: 21 Dec 2013 10:56 PM PST

Categories:

శ్రద్ధగా పరీక్ష రాస్తున్న ఈ విద్యార్థి ఎవరో కాదు! ఆయన మన రాష్ట్ర డీజీపీ ప్రసాద రావు. ‘తరంగ స్వభావాన్ని కాంతి ప్రదర్శిస్తుందా?’ అనే అంశంపై అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అందుకు అవసరమైన ప్రీ పీహెచ్‌డీ పరీక్షను శనివారం రాశారు.  

(Read more...)

ధూమ్-3కి రికార్డ్ కలెక్షన్లు

Posted: 21 Dec 2013 10:54 PM PST

Categories:

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజునే భారత్ లో 36 కోట్ల రూపాయలు, ప్రపంచ వ్యాప్తంగా 56.80 కోట్లను వసూలు చేసింది. రిలీజైన తొలి రోజునే క్రిష్-3 నమోదు చేసిన 35.91 కోట్ల రికార్డును అధిగమించింది. తొలి ఆట నుంచే సక్సెస్ టాక్ ను సంపాదించుకున్న ధూమ్-3 భారీ కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశం [...]

(Read more...)

జయంతి నటరాజన్ రాజీనామా

Posted: 21 Dec 2013 10:51 PM PST

Categories:

న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే గోవా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ పీసీసీ పగ్గాలను కొత్తవారికి అప్పగించిన పార్టీ తాజాగా పలువురు కేంద్ర మంత్రుల సేవలను పార్టీ పటిష్ఠానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దీంతో జయంతి బాటలో మరికొందరు కేంద్ర [...]

(Read more...)

వినోదం - తాజా - Google వార్తలు