| ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోలేం Posted: 21 Dec 2013 12:40 AM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కృష్ణానదీ జలాల పం పిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ఇచ్చిన తుది తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ప్రధాని మన్మోహన్ సింగ్స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసు విషయంలోజా గ్రత్త వహించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కి రణ్ ఆధ్వర్యంలోమంత్రులు సుదర్శన్ రెడ్డి, జానారెడ్డి, పార్థసారథి, టీడీపీ నాయకులు రావులచంద్రశేఖర్ రెడ్డి, కోడెల శివప్రసాద్, బీజేపీ నాయకుడు నాగంజనార్దన్‌రెడ్డి, సీపీఎం నాయకులు బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీపీఐనా యకులు కె నారాయణ, [...] |
|
| తెలంగాణాకు మరికొన్ని యూనివర్సిటిలు Posted: 21 Dec 2013 12:31 AM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో వరమిచ్చింది!హైదరాబాద్‌లోనే మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది!పారిశ్రామిక నైపుణ్య శిక్షణకు సంబంధించి దేశంలోనే ఇది తొలి యూనివర్సిటీకావడం విశేషం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జాతీయ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీనిఏర్పాటు చేయాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) శాఖతలపెట్టింది. దేశ యువతలో పారిశ్రామిక నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈయూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపారిశ్రామిక, నైపుణ్య శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకుప్రధాన మంత్రి ఉపాధి [...] |
|
| అధిక ఒత్తిడితో గుండెపోటు ప్రమాదం Posted: 21 Dec 2013 12:27 AM PST | Categories: వాషింగ్టన్, డిసెంబర్ 20: మీరు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారా? అయితే మీకు స్ట్రోక్ వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అమెరికాలో 25-74 వయసున్న వారిపై నిర్వహించిన ఓ సర్వేలో ఇది వెల్లడైం ది. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే పేరిట సుమారు ఏడువేలమందిని పరిశీలించా రు. వీరందరికీ రక్త పరీక్షలు నిర్వహించడంతోపాటు వారిలోని ఒత్తిడి స్థాయిలనూ అంచనా వేశారు. ఒ త్తిడి అధికంగా ఉన్నవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు 33శాతం [...] |
|
| చెక్‌పోస్టుల్లో ఏసీబీ సోదాలు: నగదు స్వాధీనం Posted: 21 Dec 2013 12:20 AM PST | Categories: హైదరాబాద్, డిసెంబర్ 21 : రాష్ట్ర వ్యాప్తంగా పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులుశనివారం ఉదయం సోదాలు నిర్వహించారు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆర్టీఏసిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులుసోదాలు జరిపారు. నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ, తూ.గో, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికారుల సోదాల్లో వసూళ్లకు పాల్పడి నప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదునుస్వాధీనం చేసుకున్నారు. |
|
| గులాబీతో టి ఆర్ ఎస్ కు తలనొప్పి Posted: 20 Dec 2013 11:33 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులకు ఇప్పుడు సరికొత్త గుబులు పుట్టుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎంలు) ‘పైన ఎవరూ కాదు‘ అన్న బటన్‌ను కూడా చేర్చింది. వివిధ పార్టీల గుర్తులతోపాటు దీనిని కూడా ఈవీఎంల్లో పొందుపర్చారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ సదుపాయం ఉన్న ఈవీఎంలను వాడారు. అయితే, ఈ బటన్‌ను గులాబీ రంగులో ముద్రించారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా [...] |
|
| పుజారా సెంచరీ : విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ Posted: 20 Dec 2013 11:30 PM PST | Categories: జొహానస్‌బర్గ్, డిసెంబర్ 20: తొలుత జహీర్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో, ఆతర్వాత చటేశ్వర్ పుజారా సెంచరీ, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ మోర్న్ మోర్కెల్ మూడోరోజు ఆటలో గాయపడడం దక్షిణాఫ్రికాను కష్టాల్లోకి నెట్టింది. మోర్కెల్‌కు కనీసం వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. కీలక బౌలర్ గాయపడిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఈ [...] |
|
| మదుపరుల ప్రయోజనాలకే ప్రాధాన్యం Posted: 20 Dec 2013 11:19 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 20: మదుపర్ల ప్రయోజనాలే ముఖ్యమని, వారి రక్షణకే మా తొలి ప్రాధాన్యత అని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలెట్ నొక్కిచెప్పారు. నేషనల్ స్పాట్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఇఎల్) కుంభకోణాన్ని ఎదుర్కొనేందుకు మా (పభుత్వం) ముందున్న అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సిఐఐ-ఐటిసి సస్టెయినబులిటి 2013 అవార్డుల కార్యక్రమంలో పైలెట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంపై రాబోయే కొద్దిరోజుల్లోనే తమ మంత్రత్వ శాఖకు తుది [...] |
|
| అభ్యర్థుల ఎంపిక కసరత్తులో బాబు Posted: 20 Dec 2013 11:11 PM PST | Categories: హైదరాబాద్, డిసెంబర్ 20 : రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కసరత్తును టీడీప అధ్యక్షుడు చంద్రబాబు ముమ్మరం చేశారు. దీనిపై దృష్టి పెట్టే నిమిత్తం ఆయన శుక్రవారం నుంచి సాయంత్రంపూట అపాయింట్‌మెంట్లు రద్దు చేశారు. సాధారణ ఎన్నికల ప్రక్రియ మొదలుకావడానికి ఇక సరిగ్గా వంద రోజుల సమయం ఉందని ఆ పార్టీ వర్గాల అంచనా. ఈలోపు కొంత సమయం అసెంబ్లీ సమావేశాలకు పోతుంది. ఎన్నికల ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ఎన్నికలకు సమాయత్తం చేసే [...] |
|
| సాంకేతిక పరిజ్ఞానంతోనే గ్రామీణ పునరుజ్జీవనం Posted: 20 Dec 2013 11:10 PM PST | Categories: చెన్నై, డిసెంబర్ 20: ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ సాంకేతిక పరిజ్ఞానంపైఆధారపడి ఉంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అభివృద్ధినిపెంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని, అలాంటిసాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో దేశ విజ్ఞాన వౌలిక సదుపాయాలుకీలకపాత్ర పోషించాలని ఆయన ఇంజనీర్లు, శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. ఈవిషయంలో అవసరమైన దూరదృష్టిని కూడా పెంపొందించాలని ఆయన ఉద్బోధించారు.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) మూడు రోజుల పాటు ఇక్కడనిర్వహిస్తున్న 28వ ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్‌ను రాష్టప్రతి శుక్రవారంప్రారంభించారు. ఈ [...] |
|
| ఈనాడు కార్యాలయానికి అద్దె చెల్లించండి Posted: 20 Dec 2013 10:34 PM PST | Categories: విశాఖపట్నం : కేసు విచారణ పూర్తయ్యేవరకు విశాఖ సీతమ్మధారలోని భవనంలోనే ఈనాడు కార్యాలయం కొనసాగాలంటే నెలకు రూ. 17 లక్షలు చొప్పున అద్దె చెల్లించాలని ఈనాడు యజమాని రామోజీరావును హైకోర్టు ఆదేశించింది. అలాగే పాత బకాయిలు రూ. 2.06 కోట్లను వచ్చే నెల 10వ తేదీలోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈనాడు కార్యాలయం స్థల యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారె డ్డి ఈ [...] |
|