| వినూత్నంగా ’1′ ఆడియో విడుదల Posted: 20 Dec 2013 12:45 AM PST | Categories: హైదరాబాద్, డిసెంబర్ 19 : అభిమానులే ‘ఆడియో ఆవిష్కర్త’లు అయ్యారు. ఒకే సమయంలో వివిధ ప్రాంతాల్లో అభిమానులు చేసిన సందడికి… హీరోసహా మొత్తం చిత్ర యూనిట్ ప్రేక్షకులయ్యారు. మహేష్ హీరోగా నటించిన ’1 నేనొక్కడినే’ ఆడియో వేడుక ఇలా వినూత్నంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ’1′ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ [...] |
|
| 2000 మెగావాట్ల కొనుగోలుకు ట్రాన్స్‌కో సిద్ధం Posted: 20 Dec 2013 12:41 AM PST | Categories: హైదరాబాద్, డిసెంబర్ 19: వచ్చే ఏడాది ఖరీఫ్, ఇతర రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు మార్కెట్ నుంచి 2000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లను కూడా పిలిచింది. జూన్ 2014 నుంచి మే 2015 వరకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుందని టెండర్లలో పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ లోటు దాదాపు 3500 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. జెన్‌కోకు చెందిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ [...] |
|
| ప్రధానితో ముగిసిన అఖిలపక్ష నేతల భేటీ Posted: 20 Dec 2013 12:10 AM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సీఎం కిరణ్ అధ్యక్షతన అఖిలపక్ష నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి హరీష్‌రావత్ పాల్గొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయం గురించి ప్రధానికి నేతలు వివరించారు. |
|
| ఇస్లామిక్ వర్శిటీ నిర్మాణాలు తొలగించాలి Posted: 20 Dec 2013 12:09 AM PST | Categories: తిరుపతి, డిసెంబర్ 19: ఓటు బ్యాంకు రాజకీయాలతో తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చేస్తూ పాలకులు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని, తిరుమల తిరుపతి పవిత్రతా సంరక్షణ వేదిక అధ్యక్షులు,శ్రీకాకుళం శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా మీడియాకు తెలియకుండా 12 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద హీరా సంస్థ అక్రమంగా నిర్మించిన ఇస్లామిక్ ఇంటర్నేషనల్ వర్శిటీ నిర్మాణాలను తొలగించాలని, లేదా తక్షణం [...] |
|
| ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లకు పిసిసి అధ్యక్షుల నియామకం Posted: 19 Dec 2013 11:52 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాష్ట్రాల పార్టీ విభాగాలను ప్రక్షాళనం చేయడానికి నడుం బిగించిన కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త పిసిసి అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ పిసిసి అధ్యక్షుడిగా అరవింద్ సింగ్ లలీని, చత్తీస్‌గఢ్ పిసిసి అధ్యక్షుడిగా భూపేష్ భాగెల్‌ను నియమించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జెపి అగర్వాల్ స్థానంలో రాష్ట్ర [...] |
|
| నెంబర్ ప్లేట్ల’పై 8 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు Posted: 19 Dec 2013 11:43 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వాహనాలకు 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల్' (హెచ్‌ఎస్‌ఆర్‌పి) విషయంలో గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎనిమిది రాష్ట్రాలకు నోటీసులు పంపింది. న్యాయమూర్తులు ఎకె పట్నాయక్, జెఎస్ ఖేహార్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ మేరకు గురువారం నోటీసులు [...] |
|
| త్వరలో ఏడో వేతన సంఘం Posted: 19 Dec 2013 11:41 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వచ్చే ఏడాది మే నెలలో జరిగే సాధారణ ఎన్నికలకు ముందే ఏడో వేతన సంఘాన్ని నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా సుమారు ఏభై లక్షల మంది ఉద్యోగుల జీతభత్యాలను సవరించేందుకు ఏడో వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. కేంద్ర మంత్రిమండలి సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే రెండు వారాల్లోగా ఏడో వేతన సంఘం ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఎన్నికలకు వెళ్లేలోగానే ఇదంతా జరిగి పోవాలని [...] |
|
| 1-నేనొక్కడినే పోస్టర్ పై వివాదం Posted: 19 Dec 2013 06:11 PM PST | Categories: హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం '1-నేనొక్కడినే’ పోస్టర్ విడుదల చేశారు. అది పెద్ద వివాదం రేపింది. ఇక సినిమా ఎంత సంచలనం సృష్టిస్తోందోనని సినీవర్గాల చర్చ. పైన పోస్టర్ లో హీరో మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటే హీరోయిన్ కృతి సనన్ అతని కాలి అడుగులను మోకాళ్లు, చేతులతో పాకుతూ అనుసరిస్తూ ఉంది. ఈ పోస్టర్ ను దృష్టిలోపెట్టుకొనే హీరోయిన్ సమంత సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చేసిన వ్యాఖ్యలపై ట్విట్ల యుద్ధం జరుగుతోంది. సమంతకు [...] |
|
| తదుపరి సమావేశాల్లో టి. బిల్ Posted: 19 Dec 2013 05:38 PM PST | Categories: న్యూఢిల్లీ, డిసెంబర్ 19: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు తదుపరి సమావేశాల్లో ప్రతిపాదిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో గురువారం ఇంటెలిజెన్స్ బ్యూరో వార్షిక ఎండోమెంట్ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కాగా, సీమాంధ్ర ప్రాంత ఎంపీల నిరసనల నేపథ్యంలో రెండు రోజులకు ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ప్రోరోగ్ చేయకుండా జనవరిలో మళ్లీ సమావేశాలను నిర్వహించే [...] |
|
| కథ అర్థమైతే ఎడిటింగ్ ఇబ్బంది కాదు Posted: 19 Dec 2013 05:32 PM PST | Categories: మణిరత్నంలాంటి ఎందరో సృజనాత్మక దర్శకులకు ఆస్థాన ఎడిటర్ అయిన అక్కినేని శ్రీకర్‌ప్రసాద్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 15 భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ చేయడం ఒక రికార్డ్ కాగా, అత్యధిక జాతీయ అవార్డులు కైవసం చేసుకోవడం మరో రికార్డ్. ఈ రెండు రికార్డుల పరంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు ధ్రువపత్రాలు అందుకున్నారాయన. ఈ సందర్భంగా శ్రీకర్‌ప్రసాద్ ఇంటర్వ్యూ… కంగ్రాట్స్ సార్… థ్యాంక్సండీ. రెండు రోజుల క్రితమే లిమ్కా బుక్ ఆఫ్ [...] |
|