Recent Posts

8pm NEWSFEED

19, డిసెంబర్ 2013, గురువారం

8pm NEWSFEED


లోక్‌సభ నిరవధిక వాయిదా

Posted: 18 Dec 2013 07:18 PM PST

Categories:

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర మంత్రివర్గంపై ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తూ సీమాంధ్ర ఎంపీలు సృష్టించిన హంగామా మూలంగా లోక్‌సభ గడువుకు రెండు రోజుల ముందే నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 తేదీ ప్రారంభం కాగా సీమాంధ్ర ఎంపీలు 10నుండి ప్రతిరోజూ కేంద్ర మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తూ లోక్‌సభ కార్యక్రమాలను స్తంభింపజేశారు. సీమాంధ్ర ఎంపీలు బుధవారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును యాభై మంది ఎంపీలు బలపరిచేందుకు [...]

(Read more...)

వైభవంగా మహాసౌరయాగం

Posted: 18 Dec 2013 07:09 PM PST

Categories:

శ్రీకాకుళం, డిసెంబర్ 18: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలోమహాసౌరయాగ సహిత మహాకుంభాభిషేక మహాత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం పూర్ణకుంభంతో ఆలయ అర్చక బృందం తిరువీధి నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రయుత ధనుర్లగ్నంలో మహాసౌరయాగ కలశాన్ని సూర్యనారాయణ స్వామివారి చెంత ఉంచి విశేష హారతిని ఇచ్చిన అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రధాన యాగశాలలో సద్గురు కృష్ణయాజీ ప్రత్యేక సంకల్పం చేశారు. నిగమ, ఆగమం ప్రకారం శాస్రోక్తంగా 150 మంది రుత్విక్కులు పూజలు [...]

(Read more...)

అవిశ్వాసం ఉపసంహరణ

Posted: 18 Dec 2013 06:53 PM PST

Categories:

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ ను ఉపసంహరించుకున్నారు. తాము వ్యూహాత్మకంగానే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి చెప్పారు. రోజుకు ఒక్కొక్కరి చొప్పున అవిశ్వాస నోటీస్ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ [...]

(Read more...)

కొరియా ఓపెన్ నుంచి వైదొలగిన సైనా

Posted: 18 Dec 2013 06:35 PM PST

Categories:

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కొరియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ సైనా నెహ్వాల్ వైదొలగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా తాను వచ్చేనెల 7 నుంచి 12వ తేదీ వరకు జరిగే కొరియా ఓపెన్‌లో పాల్గొనలేనని, కాబట్టి తన ఎంట్రీ ఫామ్‌ను రద్దు చేయాలని ఆమె కొరినట్టు భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడు టిపిఎస్ పురీ తెలిపాడు. ఈ సమాచారం తమకు అందినట్టు ధ్రువీకరించిన అతను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. సరైన [...]

(Read more...)

శాసన సభ ప్రాంగణంలో పాముల అలజడి

Posted: 18 Dec 2013 06:31 PM PST

Categories:

శాసన సభ ప్రాంగణంలో పాములు అలజడి రేకెత్తిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సమావేశాలు జరుగుతున్న సమయంలో తరుచూ పాములు కన్పించటంతో అమాత్యులను, సభ్యులను, అధికారులను ఆందోళనకు గురి చేస్తుండగా, శాసనసభ భవన నిర్వహణ విభాగం అధికారుల పనితీరుకు ఇదిఅద్దం పడుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో భాగంగా మీడియాపాయింట్‌కుసమీపంలో మరో పాము దర్శనమిచ్చింది. దాన్ని గమనించి పలువురు ఎమ్మెల్యేలు, పాత్రికేయులు హడావుడి చేసే సరికి అది బండరాళ్ల కిందకు వెళ్లి దాదాపు గంట [...]

(Read more...)

కపిల్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం

Posted: 18 Dec 2013 06:23 PM PST

Categories:

    న్యూఢిల్లీ: ఈ ఏడాది 'కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం'… భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు లభించింది. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటన చేసింది. బోర్డు వార్షిక అవార్డుల కార్యక్రమంలో దీన్ని ఆయనకి అందజేయనున్నారు. చెన్నైలో సమావేశమైన బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, కార్యదర్శి సంజయ్ పటేల్, సీనియర్ జర్నలిస్ట్ అయాజ్ మెమన్‌లతో కూడిన అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా ఈ హర్యానా ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసింది. కపిల్‌కు ట్రోఫీతో [...]

(Read more...)

ఫిబ్రవరిలో విభజన: దామోదర

Posted: 18 Dec 2013 06:00 PM PST

Categories:

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా పూర్తవుతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడుతున్నారు. శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన పూర్తవుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదంటున్నారు. ఎంత ఆలస్యం చేసినా ఫిబ్రవరి 15 నాటికి తెలంగాణ ఖాయమని, ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన ఉంటుందని దామోదర వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గాల రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేయాల్సి [...]

(Read more...)

ఇండియా 255/5: దక్షినాఫ్రికాతో తొలిటెస్ట్

Posted: 18 Dec 2013 05:58 PM PST

Categories:

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (181 బంతుల్లో 119; 18 ఫోర్లు) అద్భుత సెంచరీతో చెలరేగాడు. అజింక్య రహానే (105 బంతుల్లో 43 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో పాటు కెప్టెన్ ధోని (46 బంతుల్లో 17 బ్యాటింగ్; 3 ఫోర్లు) [...]

(Read more...)

రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తు

Posted: 18 Dec 2013 05:40 PM PST

Categories:

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిసారిగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆయన ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలి రానున్నారు. గురువారం సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్రపతి విమానం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగనుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయనను తీసుకువచ్చే వాహనాలతో బుధవారం మధ్యాహ్నం రూటు రిహార్సల్‌ను అధికారులు నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం నుంచి [...]

(Read more...)

ఈనాడు అక్రమ కట్టడాలు కూల్చేయండి

Posted: 18 Dec 2013 05:28 PM PST

Categories:

విశాఖపట్నం: విశాఖపట్నంలోని 'ఈనాడు' కార్యాలయంలో అక్రమంగా నిర్మించిన భవనాల్ని కూల్చివేయాలని మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్.. జోనల్ కార్యాలయానికి, 'ఈనాడు' కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలను 15 రోజుల్లో కూల్చివేయాలని పేర్కొన్నారు. లీజుకని తీసుకుని.. తానే యజమానినని చెప్పి.. విశాఖ సీతమ్మధారలో 'ఈనాడు' కార్యాలయం ఉన్న స్థల వాస్తవ యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ. 2.78 ఎకరాల ఆ స్థలాన్ని, 40 వేల చదరపు అడుగులు [...]

(Read more...)

వినోదం - తాజా - Google వార్తలు