Recent Posts

8pm NEWSFEED

18, డిసెంబర్ 2013, బుధవారం

8pm NEWSFEED


దక్కన్ క్రానికల్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

Posted: 18 Dec 2013 12:33 AM PST

Categories:

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో దక్కన్ క్రానికల్‌కు చుక్కెదురైంది. కోటక్ మహీంద్రాతో వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దక్కన్ క్రానికల్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అ ప్పులు తీసుకుని చెల్లింపుల్లో డీఫాల్ట్ అయిన విషయం తెలిసిందే. కోటక్ బ్యాంకు నుంచి తీసుకున్న 110 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి హైదరాబాద్‌లోని ఒక స్థిరాస్తిని ఖాళీ చేసి బ్యాంకుకు [...]

(Read more...)

50 లక్షల విలువైన నగలు స్వాధీనం

Posted: 17 Dec 2013 06:33 PM PST

Categories:

హైదరాబాద్ డిసెంబర్ 16: జల్సాలకు అలవాటు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరనా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయలు విలువ చేసే నగలు, వస్తువులు స్వాధీనం చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ డిసిపి జోన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం నేరేడ్‌మెట్ డిసిపి కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి నవదిప్‌సింగ్, క్రైం డిసిపి జానకిషర్మిల వివరాలు వెల్లడించారు. కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన ఎండి రహీంఖాన్ అలియాస్ సమీర్‌ఖాన్, నరుూంఖాన్(24) పాతనేరేస్థుడు. గతంలో [...]

(Read more...)

ఎదురీదుతున్న ఇంగ్లండ్

Posted: 17 Dec 2013 06:10 PM PST

Categories:

పెర్త్, డిసెంబర్ 16: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. షేన్ వాట్సన్ మెరుపు సెంచరీతో ఆసీస్‌ను పటిష్టమైన స్థితిలో నిలిపా డు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఈ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 369 పరుగుల వద్ద డిక్లేర్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ ముందు అసాధ్యంగా కనిపిస్తున్న 504 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ పోరాటాన్ని కొనసాగిస్తూ, [...]

(Read more...)

అమెరికాలో ఎన్నికల సంస్కరణలు

Posted: 17 Dec 2013 05:44 PM PST

Categories:

వాషింగ్టన్: మరో సంస్కరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుడుతోంది. అంతర్జాలం నుంచి నేరుగా బ్యాలెట్ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. దీంతో పోస్టల్ ఓటింగ్ విధానం మరింత సరళతరం కానుంది. డౌన్‌లోడ్ చేసుకున్న బ్యాలెట్ పత్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకుని వాటిని పోస్టు ద్వారా ఈసీకి పంపాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్ ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ ప్రకటించారు. కొత్త విధానంతో ఖాళీ బ్యాలెట్ పేపర్లను పోస్టు [...]

(Read more...)

రాష్ట్రంలో తగ్గిన చక్కెర ఉత్పత్తి

Posted: 17 Dec 2013 05:42 PM PST

Categories:

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గిందని అఖిల భారత చక్కెర మిల్లుల సంఘం (ఇస్మా) వెల్లడించింది. ఈ ఏడాది సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్)లో రాష్ట్రంలో 0.95 లక్షల టన్నుల చక్కెర మాత్రమే ఉత్పత్తి అయిందని తెలిపింది. సమీక్షా కాలంలో దేశవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తి 50 శాతం తగ్గి, 24.24 లక్షల టన్నులకు పరిమితమైందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో చెరకు క్రషింగ్ కార్యకలాపాల్లో జరిగిన జాప్యం కారణంగా ఉత్పత్తి కుంటుపడిందని వివరించింది. ఈ ఏడాది [...]

(Read more...)

నేడు బ్యాంకుల సమ్మె

Posted: 17 Dec 2013 05:34 PM PST

Categories:

న్యూఢిల్లీ: వేతనాలు పెంపు, ఇతర డిమాండ్ల సాధన కోసం బ్యాంకు యూనియన్లు బుధవారం నాడు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రధాన కార్మిక కమిషనర్, యూనియన్లు, ఐబిఐ మధ్య చర్చలు విఫలం కావటంతో సమ్మెకు దిగినట్లు యునైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) కన్వీనర్ సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె కారణంగా బుధవారం బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుందని వినియోగదారులకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఇప్పటికే తెలిపింది. 20 వేల మంది ఆఫీసర్లు, ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని [...]

(Read more...)

పెరగనున్న ‘హ్యూందాయ్’ ధరలు

Posted: 17 Dec 2013 05:27 PM PST

Categories:

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరుగుదల వచ్చే జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. మంగళవారం, ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేస్తూ అన్ని మోడళ్లకు వర్తించే ఈ ధరల పెరుగుదల రూ.5 వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుందని తెలిపింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, రూపా యి పతనం, ద్రవ్యోల్బణంతో ఉత్పత్తి ఖర్చులు నిరంతరాయంగా పెరుగుతుండటం వల్ల ధరలను పెంచాల్సి [...]

(Read more...)

పెళ్లి చేసుకోమన్నందుకు నిప్పు పెట్టాడు

Posted: 17 Dec 2013 04:54 PM PST

Categories:

నల్లగొండ , డిసెంబర్ 17: బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థినిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కనగల్ మండలం కురంపల్లి గ్రామానికి చెందిన తలారి ఈశ్వరయ్య, పిచ్చమ్మల 21ఏళ్ల కుమార్తె నల్లగొండ పట్టణ సమీపంలోని చెర్లపల్లి నిట్స్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. నల్లగొండ మండలం దర్వేశిపురానికి చెందిన నకిరేకంటి సైదులు (25)తో అరుణ ప్రేమలో పడింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య [...]

(Read more...)

విస్తరణ బాటలో యునినార్

Posted: 17 Dec 2013 04:44 PM PST

Categories:

హైదరాబాద్ : కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లను సంపాదించుకునేందుకు యునినార్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా నెట్‌వర్క్‌ను విస్తరించడంతోపాటు ఎక్స్‌క్లూజివ్, రిటైల్ స్టోర్ల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుకోనుంది. ప్రస్తుతం 2,568 పట్టణాలు, గ్రామాల్లో 2,900 నెట్‌వర్క్ సైట్స్ ఉన్నాయని, కొత్తగా 550 నెట్‌వర్క్ సైట్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 2,700 ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుందని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ సతీష్ కన్నన్ తెలిపారు. ఐదు నెలల్లో కొత్త [...]

(Read more...)

రాష్ట్ర విభజన కోసం ఎన్నికలు వాయిదా?

Posted: 17 Dec 2013 04:38 PM PST

Categories:

హైదరాబాద్, డిసెంబర్ 17 : ‘వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో జరగవు’… కొన్నాళ్లుగా తెలంగాణ వాదులు ధీమాగా చెబుతున్న ఈ మాటే నిజమవుతుందని తెలుస్తోంది. అయితే… దీని అర్థం 2014 ఎన్నికల్లోపు రాష్ట్ర విభజన పూర్తి అవుతుందని కాదండోయ్! రాష్ట్ర విభజన పూర్తయ్యేదాకా అసెంబ్లీ ఎన్నికలను నిలిపివేయడమే దీని పరమార్థం! అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి ఎన్నికల గడువు ముంచుకొస్తున్న సంగతి తెలిసిందే. “పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందడం వరకు సజావుగా జరుగుతుంది. ఆ తర్వాత [...]

(Read more...)

వినోదం - తాజా - Google వార్తలు