న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వాహనాలకు 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల్' (హెచ్‌ఎస్‌ఆర్‌పి) విషయంలో గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎనిమిది రాష్ట్రాలకు నోటీసులు పంపింది. న్యాయమూర్తులు ఎకె పట్నాయక్, జెఎస్ ఖేహార్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ మేరకు గురువారం నోటీసులు పంపింది. నెంబర్ ప్లేట్ల విషయమై నాలుగు వారాల్లోగా స్పందించాలని 'ఆటోమేటివ్ రీసెర్చి అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (పూణె), 'కేంద్ర రహదారుల పరిశోధనా సంస్థ' (్ఢల్లీ)లను కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకానక్కర్లేదని, తదుపరి విచారణను వచ్చే జనవరి మొదటి వారంలో చేపడతామని న్యాయమూర్తులు ప్రకటించారు. అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక సమాఖ్య అధ్యక్షుడు ఎంఎస్ బిట్టా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయమై న్యాయస్థానం పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని బిట్టా ఫిర్యాదు చేశారు. సంఘ వ్యతిరేక శక్తులు ఈ నెంబర్ ప్లేట్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
21, డిసెంబర్ 2013, శనివారండిసెంబర్ 21, 2013
నెంబర్ ప్లేట్ల’పై 8 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
By Fun Counter
21, డిసెంబర్ 2013, శనివారం