జొహాన్నెస్‌బర్గ్, డిసెంబర్ 19 : దక్షిణాఫ్రికతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్ 280 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 255/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజైన గురువారం ఆట ప్రారంభించిన ఇండియా 25 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో బుధవారమిక్క డ మొదలైన తొలి టెస్టులో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. యువ సంచలనం విరాట్ కోహ్లీ (181 బంతుల్లో 18 ఫోర్లతో 119) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఐదు వికెట్లకు 255 పరుగులు చేసింది. కోహ్లీ కెరీర్‌లో ఇది ఐదో టెస్టు సెంచరీ కాగా దక్షిణాఫ్రికాపై మొదటిది.
విదేశీ గడ్డపై రెండోది. అజింక్యా రహానె (105 బంతుల్లో 43 బ్యాటింగ్), చటేశ్వర్ పుజారా (98 బంతుల్లో 2 ఫోర్లతో 25) రాణించారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న శిఖర్ ధవన్ (13), రోహిత్ శర్మ (14), మురళీ విజయ్ (6) మాత్రం తీవ్రంగా నిరాశపర్చారు. రహానెతోపాటు కెప్టెన్ ధోనీ (17 బ్యా టింగ్) క్రీజులో ఉన్నాడు. కాగా, అదరగొడతారనుకున్న సఫారీ బౌలర్లు తొలిరోజు తేలిపోయారు. స్టె యిన్, ఫిలాండర్, మోర్కెల్, కలిస్ తలో వికెట్ మా త్రమే పడగొట్టగలిగారు.