విజయవాడ : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డీలర్లకు రావాల్సిన మార్జిన్ విషయంలో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24న దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులను బంద్ చేయనున్నట్టు కన్సార్షియమ్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ (సిఐపిడిఎ) దక్షిణ భారత ఉపాధ్యక్షుడు మలినేని నారాయణ ప్రసాద్ తెలిపారు. మార్జిన్ అంశం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద చాలా కాలంగా పెండింగులో ఉందని ఆయన చెప్పారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీలర్లకు ఇచ్చే మార్జిన్‌ను ఈపాటికే ప్రకటించాల్సి ఉందని, అయినా ఇప్పటి వరకు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన లేద ని ఆయన బుధవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ నిరసనలో భాగంగా 22,23 తేదీల్లో విద్యుద్దీపాలు వెలిగించకుండా రెండు రోజుల పాటు నిరసన వ్యక్తం చేస్తూ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తామన్నారు. సమావేశంలో ఎపి ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ ప్రాంతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా పెట్రోలియం డీలర్ల చైర్మన్ చుంచు నరసింహరావు, జనరల్ సెక్రటరీ రంగ ప్రసాద్ పాల్గొన్నారు.
20, డిసెంబర్ 2013, శుక్రవారండిసెంబర్ 20, 2013
24న పెట్రోల్ బంక్‌ల బంద్
By Fun Counter
20, డిసెంబర్ 2013, శుక్రవారం