
తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా దీక్షాసేథ్‌కి కలసి రాలేదు. రవితేజ, గోపీచంద్ సరసన నటించినా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అయితేనేం.. బాలీవుడ్‌లో ఆఫర్ అందుకొంది. అర్మాన్ జైన్ సరసన ఓ చిత్రంలోనటిస్తోంది.
అటు తమిళంలోనూ ఛాన్సులొస్తున్నాయి. ధనుష్ సరసన ఓ సినిమాలో నటించడానికి అంగీకరించింది దీక్ష. ఈ సినిమాకి గానూ... ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకొందట. తెలుగులో పేరున్న హీరోల పక్కన నటించింది అనేది ఒక కారణమైతే, ధనుష్ చిత్రంలో లిప్ లాక్కు సన్నివేశాల్లో నటించేందుకు సముఖత వ్యక్తం చేసినందుకు మరికొంత... అందాయట.
దాంతో తెగ ఖుషీ అయిపోతుంది ఈ అమ్మడు. ``నా కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ అంటూచక్కర్లు కొట్టడం సంతోషంగా ఉంది. ధనుష్ లాంటి సహజ నటుడితో సినిమా చేయడం.. సంతోషాన్నిస్తోంది.`` అంటూ సంబరపడిపోతోంది. లిప్‌లాక్‌ల గురించి అడిగితే మాత్రం... `సినిమా అన్నాక ముద్దులుండవా ఏంటి??`` అని గడుసుగా సమాధానం చెబుతోంది.
courtesy; greatandhra
- See more at: http://telugu.greatandhra.com/movies/movie-gossip/deeksha-seth-with-danush-48371.html#sthash.ZNwZdEJh.dpuf