ఊడ్చు మిషిన్
రోడ్లూడ్చు మిషిన్ లు వచ్చాయని రోడ్లు అద్దాల్ల మెరిసిపోతాయని ఓ మురిచిపోయారు.
అవి మునిసిపాలిటీ నిధులు ఊడ్చే మిషిన్ లే కానీ... రోడ్లు ఊడ్చేవి కావని తేలిపోయింది
చెత్తని కిందా మీదా కాకుండా డస్ట్ బిన్ను లో వేసే విదేశాల్లోనో,
మంచు కురిసిన రోడ్ల మీదైతే ఇవి పని చేస్తాయేమో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే మనం తిరిగే ఈ రోడ్ల మీద, ఎప్పుడూ గుంటలు పడి, రాళ్ళు తేలే మన రహదారులపైనా ఇవి ఎంతవరకు పనితనం చూపిస్తాయో ఆ భగవంతుడికే తెలియాలి.
కాంట్రాక్టరులు కొట్టేసే కమీషన్ లు పోయినా అర్ధరాత్రి నుంచీ తెల్లవారు ఝాము వరకూ రోడ్లూడ్చే వారి కడుపుకొట్టి ఎవరికో దోచిపెట్టే ఈ కొత్త మిషిన్ల కొనుగూలులో ఏదో మతలబు..
ఖచ్చితంగా స్కాములు జరిగి నిధులు ఊడవడానికి ఎంతో ఆస్కారమున్నట్టుగా ....
భవధీయుడి అనుమానం.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
