Recent Posts

మా నేల తల్లిని కబ్జా చేస్తున్నారు

10, జులై 2010, శనివారం
మా నేల తల్లిని కబ్జా చేస్తున్నారు
మా భూమి తల్లిని చక్కగా భోంచేస్తున్నారు
కడుపులో బంగారాన్ని దోచుకు తింటున్నారు
కనుచూపు మేరా ఆక్రమించుకుంటున్నారు
చిరునవ్వు తో సిరులు పంచుకు తింటున్నారు

గల గలా గోదారి మహరాష్ట్రకు తరలిపోతుంటే
బిర బిరా కృష్ణమ్మ కర్ణాటకలో ఆగిపోతుంటే
బంజరు భూములే మిగులుతాయి
మరుభూములే మనకి కనబడతాయీ..

మా నేల తల్లిని కబ్జా చేస్తున్నారు.
మా భూమి తల్లిని చక్కగా భోంచేస్తున్నారు

అసెంబ్లీ నగరి ఆ ఆపసోపాలు
దాహార్తి తో చేసే ఆ ఆర్తనాదాలు
తిరుమలేశుని మింగేసే తిమింగలాలు
నిత్యమూ నిఖిలమూ ముంచిపోయేదాక 

రౌడీ షీటర్ల భుజశక్తి
పదవి పైన పెను భక్తి
గోతులు తీసే కుయుక్తి
గనుల స్వాహాలో ఘన కీర్తి

మా కనుల ముందే తిరుగుతుంటే
చూస్తూ నే ఉంటాము
బిరియానీ సారాలకు వోటమ్ముకుంటాము
జై నేల తల్లీ జై పుడమి తల్లీ









నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

వినోదం - తాజా - Google వార్తలు